
షోస్

ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణ (ఎస్‌ఐఆర్) ప్రక్రియలో భాగంగా విడుదల చేసిన ముసాయిదా ఓటర్ల జాబితాలో పేర్లు లేని వారికి ఎన్నికల సంఘం ఊరటనిచ్చింది. అలాంటి ఓటర్లు తమ పేర్లను తిరిగి ఓటరు జాబితాలో చేర్చుకునేందుకు ఫామ్-6 ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని స్పష్టం చేసింది. ఫామ్-6 దాఖలు చేసినంత మాత్రాన సంబంధిత ఓటర్లపై ఎలాంటి చట్టపరమైన చర్యలు తీసుకోబోమని వెల్లడించింది.
అయితే, ఫామ్-6 ద్వారా దరఖాస్తు చేసుకునే వ్యక్తికి మరో నియోజకవర్గంలోని ఓటర్ల జాబితాలో ఇప్పటికే పేరు ఉండకూడదని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. ఈ నిబంధనకు అనుగుణంగా ఉన్న ఓటర్లు తమ పేర్లను మళ్లీ నమోదు చేసుకునేందుకు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపింది. ముసాయిదా జాబితాలో పేరు కనిపించక ఆందోళన చెందుతున్న ఓటర్లకు ఈ స్పష్టత ఊరటనివ్వనుంది.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!