
జనరల్

పైరసీ కేసులో ఐబొమ్మ రవికి నాంపల్లి కోర్టులో స్వల్ప ఊరట లభించింది. కేసు దర్యాప్తులో భాగంగా పోలీసులు రవికి చెందిన బ్యాంక్ ఖాతాలను ఫ్రీజ్ చేశారు. దీంతో కుటుంబ పోషణకు, రోజువారీ అవసరాలకు డబ్బులు వినియోగించుకోలేక ఇబ్బందులు ఎదురవుతున్నాయని పేర్కొంటూ రవి కోర్టును ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో పోలీసులు సీజ్ చేసిన బ్యాంక్ ఖాతాలను సాధారణ లావాదేవీల కోసం వినియోగించుకునేందుకు నాంపల్లి కోర్టు అనుమతించింది.
అయితే ఖాతాల్లో ఫ్రీజ్ చేసిన సుమారు రూ.3 కోట్ల మొత్తాన్ని అన్‌ఫ్రీజ్ చేసేందుకు కోర్టు అనుమతించలేదు. ఆ మొత్తాన్ని వినియోగించుకునే అవకాశం కల్పించాలని రవి కోరినప్పటికీ, న్యాయస్థానం అందుకు అంగీకరించలేదు. ప్రస్తుతం బ్యాంక్ ఖాతాలను వినియోగించుకునే వెసులుబాటు మాత్రమే కల్పిస్తూ, రూ.3 కోట్ల మొత్తంపై ఫ్రీజ్ కొనసాగించాలని ఆదేశించినట్లు తాజా నివేదికలు వెల్లడించాయి.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!