

కోలీవుడ్‌లో ప్రస్తుతం అత్యంత చర్చనీయాంశంగా మారిన ప్రాజెక్టుల్లో ధనుష్ ‘D57’ ఒకటి. ఈ చిత్రంలో జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటించనున్నట్లు, ప్రముఖ దర్శకుడు వెంకట్ ప్రభు దర్శకత్వం వహించనున్నట్లు సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ధనుష్, జాన్వీ కపూర్, వెంకట్ ప్రభు మధ్య చర్చలు పూర్తయ్యాయని, ప్రాజెక్ట్ దాదాపు ఖరారైనట్లు సమాచారం. అయితే ఇప్పటివరకు చిత్రబృందం నుంచి అధికారిక ప్రకటన వెలువడలేదు.
ఈ ప్రాజెక్ట్ అధికారికంగా ప్రకటిస్తే, ఈ ఏడాది కోలీవుడ్‌లోనే అత్యంత క్రేజీ మూవీ అనౌన్స్‌మెంట్‌లలో ఒకటిగా నిలిచే అవకాశం ఉందని సినీ వర్గాలు భావిస్తున్నాయి. ఇప్పటికే బాలీవుడ్‌తో పాటు టాలీవుడ్‌లో కూడా తనకంటూ గుర్తింపు తెచ్చుకున్న జాన్వీ కపూర్, ఈ చిత్రం ద్వారా తమిళ చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టనున్నట్లు ప్రచారం జరుగుతోంది. దీంతో ఈ కాంబినేషన్‌పై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!