

భారత పర్యటనలో ఉన్న నేపాల్ ప్రధాన మంత్రి బాలేంద్ర షా.. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఇరు దేశాల మధ్య వ్యూహాత్మక సంబంధాలను మరింత బలోపేతం చేయడం, ద్వైపాక్షిక సహకారాన్ని పునరుద్ధరించడం వంటి అంశాలపై చర్చించారు. భేటీ అనంతరం ఇరు దేశాల ప్రధానులు సంయుక్త మీడియా సమావేశంలో మాట్లాడారు. భోటేకోషి విపత్తు తర్వాత నేపాల్‌లో అభివృద్ధి, పునర్నిర్మాణ కార్యక్రమాలకు తోడ్పాటునందించేందుకు ప్రధాని మోదీ 24,000 కోట్ల నేపాలీ రూపాయల ఆర్థిక ప్యాకేజీని ప్రకటించారు. ఇది భారత కరెన్సీలో సుమారు రూ.15,109 కోట్లకు సమానం. నేపాల్ అభివృద్ధి ప్రయాణంలో భారత్ భాగస్వామిగా నిలుస్తుందని ఈ ప్రకటన స్పష్టం చేస్తోంది.
ఇరు దేశాల మధ్య సంబంధాలను మరింత విస్తరించేందుకు పర్యాటక రంగంలోనూ ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు ప్రధాని మోదీ తెలిపారు. పర్యాటకాన్ని ప్రోత్సహించడం ద్వారా ప్రజల మధ్య సంబంధాలు మరింత బలపడతాయని పేర్కొన్నారు. భారత్, నేపాల్ మధ్య చారిత్రక, సాంస్కృతిక, భౌగోళిక అనుబంధం ఎంతో బలంగా ఉందని, పరస్పర సహకారంతో ఈ సంబంధాలను మరింత ముందుకు తీసుకెళ్లాలని ఇరు దేశాల నాయకులు అభిప్రాయపడ్డారు. ఈ సమావేశం ద్వారా వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని బలోపేతం చేయడంతో పాటు అభివృద్ధి, పర్యాటక రంగాల్లో సహకారాన్ని పెంచుకునే దిశగా చర్చలు జరిగాయి.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!