
జనరల్

పశ్చిమ బెంగాల్ రాష్ట్రం పేరును ‘పశ్చిమ బంగా’గా మార్చే ప్రతిపాదనపై రాష్ట్ర ప్రభుత్వం మరోసారి ముందడుగు వేయనుంది. డిసెంబర్ 9న ఈ అంశంపై అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు సమాచారం. అసెంబ్లీ ఆమోదం అనంతరం తుది అనుమతి కోసం ఈ ప్రతిపాదనను కేంద్ర ప్రభుత్వానికి పంపించనున్నారు. రాష్ట్ర పేరును మార్చాలనే అంశంపై గతంలోనూ తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నాలు చేసింది.
గతంలో రాష్ట్రానికి ‘పశ్చిమ బంగా’, ఆ తర్వాత ‘బంగ్లా’ అనే పేర్లను ప్రతిపాదించినప్పటికీ కేంద్ర ప్రభుత్వం వాటికి ఆమోదం తెలపలేదు. తాజాగా ‘పశ్చిమ బంగా’ పేరుతో మరోసారి తీర్మానం తీసుకురావాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. ఈ ప్రతిపాదనకు అసెంబ్లీ ఆమోదం లభించి, కేంద్రం కూడా అనుమతిస్తే రాష్ట్రం పేరు అధికారికంగా మారే అవకాశం ఉంటుంది.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!