23, నవంబర్ 2026, సోమవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానంనిబంధనలు & షరతులు
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంనవలలురచయితలుడ్రాయింగ్స్పోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానంనిబంధనలు & షరతులు

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ఒక్క సీన్‌ కోసం సూర్య 20 టేక్స్‌

Writer: Pooja 02:57 PM, 23 నవంబర్, 2026
ఒక్క సీన్‌ కోసం సూర్య 20 టేక్స్‌

నటుడు సూర్య ప్రస్తుతం వరుస విజయాలతో ఫుల్‌ జోష్‌లో ఉన్నారు. జీతూ మాధవన్‌ దర్శకత్వంలో ఆయన నటించిన తాజా చిత్రం ‘సీన్‌’ దీపావళి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చి బాక్సాఫీస్‌ వద్ద మంచి విజయాన్ని అందుకుంది. కమర్షియల్‌ సినిమాలతో పాటు విభిన్నమైన పాత్రలను ఎంచుకుంటూ ప్రేక్షకులను అలరిస్తున్న సూర్య.. నటన విషయంలో ఏమాత్రం రాజీపడరు. ప్రతి సన్నివేశాన్ని పర్ఫెక్ట్‌గా తెరపైకి తీసుకురావడానికి ఎంతో శ్రమిస్తారు. తాజాగా ‘సీన్‌’ చిత్రంలోని ఓ సన్నివేశం కోసం సూర్య ఏకంగా 20 టేక్స్‌ తీసుకున్నారని దర్శకుడు జీతూ మాధవన్‌ వెల్లడించారు. ప్రతి టేక్‌లోనూ కొత్తదనం చూపించారని, దర్శకుడు ఓకే చెప్పినంత మాత్రాన సంతృప్తి చెందకుండా సన్నివేశం తనకు నచ్చే వరకు ప్రయత్నించారని ఆయన తెలిపారు.

సూర్యకు ఈ తరహా అంకితభావం కొత్తేమీ కాదు. గతంలో మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కిన ‘యువ’ సినిమా విషయంలోనూ ఇలాంటి సంఘటనే చోటుచేసుకుంది. ఆ చిత్రానికి సహాయ దర్శకురాలిగా పనిచేసిన సుధా కొంగర ఓ సందర్భంలో ఈ విషయాన్ని వెల్లడించారు. ‘యువ’లోని ఓ సన్నివేశాన్ని పర్ఫెక్ట్‌గా చిత్రీకరించేందుకు సూర్య ఏకంగా 26 టేక్స్‌ తీసుకున్నారట. కొన్ని టేక్స్‌ తర్వాత మణిరత్నం షాట్‌ను ఓకే చేసినప్పటికీ, అది తనకు నచ్చిన విధంగా రాలేదని సూర్య భావించారట. దర్శకుడు అనుకున్నట్లుగా సన్నివేశం వచ్చే వరకు ప్రయత్నిస్తూనే ఉన్నారట. చివరకు 26వ టేక్‌ తర్వాత ఆ సన్నివేశం ఓకే అయిందని సుధా కొంగర తెలిపారు. ఈ సంఘటనలు సూర్యకు నటనపై ఉన్న అంకితభావాన్ని, ప్రతి సన్నివేశంలోనూ ఉత్తమమైన ఫలితాన్ని అందించాలనే పట్టుదలను తెలియజేస్తున్నాయి.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
నాగచైతన్యకు శోభిత రొమాంటిక్ బర్త్‌డే విషెస్

నాగచైతన్యకు శోభిత రొమాంటిక్ బర్త్‌డే విషెస్

కర్ణాటకలో ‘రామాయణం’ సరికొత్త రికార్డు

కర్ణాటకలో ‘రామాయణం’ సరికొత్త రికార్డు

సద్గురు పాదాలకు నమస్కరించిన తమన్నా.. వైరల్‌గా మారిన వీడియో

సద్గురు పాదాలకు నమస్కరించిన తమన్నా.. వైరల్‌గా మారిన వీడియో

పూజా కార్యక్రమాలతో కిరణ్ అబ్బవరం కొత్త మూవీకి శ్రీకారం

పూజా కార్యక్రమాలతో కిరణ్ అబ్బవరం కొత్త మూవీకి శ్రీకారం

భోగి కథ విని శర్వానంద్ షాక్.. తననే ఎందుకు ఎంచుకున్నారో చెప్పిన సంపత్ నంది!

భోగి కథ విని శర్వానంద్ షాక్.. తననే ఎందుకు ఎంచుకున్నారో చెప్పిన సంపత్ నంది!

పల్నాడులో ఉద్రిక్తత.. బాలకృష్ణ పీఏ సహా 66 మంది అరెస్ట్.. అసలేం జరిగిందంటే?

పల్నాడులో ఉద్రిక్తత.. బాలకృష్ణ పీఏ సహా 66 మంది అరెస్ట్.. అసలేం జరిగిందంటే?

ట్యాగ్లు
సూర్యసీన్ సినిమాజీతూ మాధవన్మణిరత్నంసుధా కొంగరసూర్య నటన
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఒక్క సీన్‌ కోసం సూర్య 20 టేక్స్‌
సినిమాలు

ఒక్క సీన్‌ కోసం సూర్య 20 టేక్స్‌

పేదరికం అంటే డబ్బు లేకపోవడం మాత్రమే కాదు - నిర్మలా సీతారామన్‌
జనరల్

పేదరికం అంటే డబ్బు లేకపోవడం మాత్రమే కాదు - నిర్మలా సీతారామన్‌

పిఠాపురం జనసేనలో అసమ్మతి.. ఎంపీ పీఏపై దాడి!
రాజకీయాలు

పిఠాపురం జనసేనలో అసమ్మతి.. ఎంపీ పీఏపై దాడి!

ఇండోనేషియాలో భూకంపం
జనరల్

ఇండోనేషియాలో భూకంపం

పట్టాలెక్కిన సరయూ-కమలా ఎక్స్‌ప్రెస్..!
జనరల్

పట్టాలెక్కిన సరయూ-కమలా ఎక్స్‌ప్రెస్..!

గంగా నది తీరాన్ని శుభ్రం చేసిన విదేశీ మహిళలు.. నెటిజన్ల ప్రశంసలు
జనరల్

గంగా నది తీరాన్ని శుభ్రం చేసిన విదేశీ మహిళలు.. నెటిజన్ల ప్రశంసలు

అర్హులైన పేదలకు డబుల్ బెడ్రూం ఇళ్లు కేటాయించాలి: పద్మా దేవేందర్ రెడ్డి
రాజకీయాలు

అర్హులైన పేదలకు డబుల్ బెడ్రూం ఇళ్లు కేటాయించాలి: పద్మా దేవేందర్ రెడ్డి

ఆగ్నేయాసియా దేశాలతో బలమైన మారిటైం భాగస్వామ్యాలు - నారా లోకేశ్‌
జనరల్

ఆగ్నేయాసియా దేశాలతో బలమైన మారిటైం భాగస్వామ్యాలు - నారా లోకేశ్‌

తెలంగాణలో కాంగ్రెస్‌కు వ్యతిరేకత లేదు - మంత్రి కోమటిరెడ్డి
రాజకీయాలు

తెలంగాణలో కాంగ్రెస్‌కు వ్యతిరేకత లేదు - మంత్రి కోమటిరెడ్డి

బిగ్‌బాస్ తెలుగు 10: డే 78 ప్రోమో 2 విడుదల!
షోస్

బిగ్‌బాస్ తెలుగు 10: డే 78 ప్రోమో 2 విడుదల!

చైనా నుంచి బంగ్లాదేశ్‌కు క్షిపణి రసాయనాల అక్రమ రవాణా?
జనరల్

చైనా నుంచి బంగ్లాదేశ్‌కు క్షిపణి రసాయనాల అక్రమ రవాణా?

ఆసియా పవర్ ఇండెక్స్‌లో భారత్‌ పురోగతి
బిజినెస్

ఆసియా పవర్ ఇండెక్స్‌లో భారత్‌ పురోగతి

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!