

ఫ్లైదుబాయ్ విమానంలో చోటుచేసుకున్న తీవ్ర ఘటనలో భారత పైలట్ కెప్టెన్ స్మిత్ మచ్ఛార్ చూపిన ధైర్యాన్ని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ప్రశంసించారు. దుబాయ్ నుంచి టెల్ అవీవ్‌కు వెళ్తున్న విమానంలో కో-పైలట్ కెప్టెన్ మచ్ఛార్‌పై దాడి చేసి తీవ్రంగా గాయపరిచినట్లు సమాచారం. గాయాలపాలైనప్పటికీ ఆయన ప్రతిఘటించి కాక్‌పిట్ తలుపు తెరవడంతో ప్రయాణికులు, సిబ్బంది లోపలికి వెళ్లి దాడి చేసిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం విమానం సౌదీ అరేబియాలోని తబుక్‌లో అత్యవసరంగా ల్యాండ్ అయింది. విమానంలో 174 మంది ఉన్నట్లు అధికారులు తెలిపారు.
ఈ ఘటనపై స్పందించిన నెతన్యాహు.. కెప్టెన్ స్మిత్ మచ్ఛార్ అసాధారణ ధైర్యాన్ని ప్రదర్శించారని కొనియాడారు. తీవ్రంగా గాయపడినప్పటికీ ఆయన దాడిని ఎదుర్కొని కాక్‌పిట్ తలుపు తెరవడం ద్వారా ప్రయాణికులు, సిబ్బంది దాడి చేసిన వ్యక్తిని అదుపులోకి తీసుకునే అవకాశం కల్పించారని పేర్కొన్నారు. ఆయన చర్యల వల్ల 174 మంది ప్రాణాలు కాపాడబడ్డాయని నెతన్యాహు తెలిపారు. మచ్ఛార్ త్వరగా, పూర్తిగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ ఆయన్ను ‘నిజమైన హీరో’గా అభివర్ణించారు.



కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!