
జనరల్

హైదరాబాద్‌లోని దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. బౌరంపేట బొడ్రాయి సమీపంలోని ప్రైవేటు ట్రావెల్స్ బస్సుల పార్కింగ్ యార్డులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో ఇప్పటికే రెండు బస్సులు పూర్తిగా దగ్ధమయ్యాయి. మరో రెండు బస్సులు కూడా మంటల్లో చిక్కుకున్నట్లు ప్రాథమిక సమాచారం. దీంతో పార్కింగ్ యార్డు పరిసరాల్లో ఆందోళన నెలకొంది.
బస్సులను పక్కపక్కనే పార్క్ చేయడంతో మంటలు వేగంగా పక్కనున్న వాహనాలకు వ్యాపించాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలు, ఆస్తి నష్టం వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!