
జనరల్

విజయనగరం జిల్లాలోని కొత్తవలసకు చెందిన కోట నవీన్‌కుమార్, ప్రిషిల్లా దంపతుల కుమార్తె అవీషి లియానా చిన్న వయస్సులోనే అద్భుత ప్రతిభ కనబరుస్తోంది. కేవలం తొమ్మిది నెలల వయస్సులోనే తల్లిదండ్రులు చెప్పిన సూచనలకు స్పందిస్తూ, వారు అడిగిన బొమ్మలను గుర్తించి తీసుకువస్తోంది. తన వయస్సుకు మించిన చురుకుదనంతో అందరినీ ఆశ్చర్యపరుస్తోంది.
చిన్నారి చూపిస్తున్న అసాధారణ ప్రతిభకు గుర్తింపుగా ఆమెకు బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు దక్కింది. ఇంత చిన్న వయస్సులోనే ప్రపంచ రికార్డుల్లో స్థానం సంపాదించుకోవడంతో తల్లిదండ్రులు కోట నవీన్‌కుమార్, ప్రిషిల్లా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. తమ కుమార్తె సాధించిన విజయంపై కుటుంబ సభ్యులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!