

చేపల వంటకాలను ఇష్టపడేవారికి బొగ్గులపై కాల్చిన చేప కూర మంచి రుచిని అందిస్తుంది. ఈ వంటకం తయారు చేయడానికి ముందుగా తాజా చేపలను శుభ్రంగా కడిగి చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఒక గిన్నెలో కారం, పసుపు, తగినంత ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియాల పొడి, నిమ్మరసం వేసి బాగా కలపాలి. ఈ మసాలాలో చేప ముక్కలను వేసి అన్ని వైపులా పట్టేలా కలిపి సుమారు 40 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి. అనంతరం బొగ్గులను ఎర్రగా మండించి, చేపలు కాల్చే గ్రిల్‌కు నూనె రాసి మసాలా పట్టించిన చేప ముక్కలను దానిపై అమర్చాలి. మధ్యమధ్యలో అటూ ఇటూ తిప్పుతూ నూనె లేదా నెయ్యి రాస్తూ రెండు వైపులా బాగా కాల్చుకోవాలి.
మరోవైపు పాన్‌లో ఉల్లిపాయలు, టమాటాలు, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి బాగా వేయించుకోవాలి. అనంతరం కారం, ధనియాల పొడి, చింతపండు రసం, తగినన్ని నీళ్లు కలిపి చిక్కటి గ్రేవీ తయారు చేసుకోవాలి. చేప ముక్కలు రెండు వైపులా బాగా కాలిన తర్వాత వాటిని సిద్ధం చేసుకున్న గ్రేవీలో వేయాలి. మసాలా చేప ముక్కలకు బాగా పట్టేలా సుమారు 10 నిమిషాల పాటు ఉడికించాలి. చివరగా కరివేపాకు, కొత్తిమీర చల్లుకుంటే రుచికరమైన బొగ్గుల చేప కూర సిద్ధమవుతుంది. వేడి వేడి అన్నంతో ఈ కూరను ఆస్వాదించవచ్చు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!