10, ఆగస్టు 2026, సోమవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ఆపరేషన్‌ సఫేద్‌ సాగర్‌ వెనుక అసలు కథ ఇదే!

Writer: Chandrika 11:40 AM, 10 ఆగస్టు, 2026
ఆపరేషన్‌ సఫేద్‌ సాగర్‌ వెనుక అసలు కథ ఇదే!

1999 కార్గిల్‌ యుద్ధంలో భారత సైన్యం చేపట్టిన ‘ఆపరేషన్‌ విజయ్‌’కు మద్దతుగా భారత వాయుసేన నిర్వహించిన కీలక వైమానిక దాడులే ‘ఆపరేషన్‌ సఫేద్‌ సాగర్‌’. కార్గిల్‌, ద్రాస్‌, బటాలిక్‌ ప్రాంతాల్లో అత్యంత ఎత్తైన పర్వత ప్రాంతాలను పాక్‌ బలగాలు ఆక్రమించడంతో వాటిని తిరిగి స్వాధీనం చేసుకునేందుకు భారత సైన్యం చర్యలు చేపట్టింది. ఈ క్రమంలో బఠిండాకు చెందిన 17వ స్క్వాడ్రన్‌ ‘ది గోల్డెన్‌ యారోస్‌’ రంగంలోకి దిగింది. దాదాపు 14 వేల నుంచి 18 వేల అడుగుల ఎత్తులో ప్రయాణిస్తూ మంచు పర్వతాల్లోని శత్రు స్థావరాలను గుర్తించి దాడులు చేయడం అత్యంత సవాలుగా మారింది. అయినప్పటికీ గోల్డెన్‌ యారోస్‌ పాక్‌ స్థావరాలు, ఆయుధ నిల్వలు, సరఫరా కేంద్రాలపై కీలక దాడులు నిర్వహించింది. మిరేజ్‌-2000 యుద్ధ విమానాలు కూడా ఈ ఆపరేషన్‌లో కీలక పాత్ర పోషించాయి.

టైగర్‌ హిల్స్‌పై లేజర్‌ గైడెడ్‌ బాంబుల వినియోగం ఆపరేషన్‌ సఫేద్‌ సాగర్‌లో కీలక మలుపుగా నిలిచింది. 1999 జూన్‌ 24న వింగ్‌ కమాండర్‌ రఘునాథ్‌ నంబియార్‌ మిరేజ్‌-2000 నుంచి లేజర్‌ గైడెడ్‌ బాంబును ప్రయోగించి పాక్‌ స్థావరాన్ని ధ్వంసం చేశారు. ఈ సాంకేతికతను యుద్ధ సమయంలో సమర్థంగా వినియోగించేందుకు ఇజ్రాయెల్‌ సాంకేతిక నిపుణులు భారత్‌కు వచ్చి సుమారు 12 రోజులపాటు బెంగళూరు, గ్వాలియర్‌లో భారత వాయుసేనతో కలిసి పనిచేశారు. లేజర్‌ డిజిగ్నేటర్‌ పాడ్‌లను విమానాలు, ఆయుధాలతో అనుసంధానించడంలో వారు సహకరించారు. యుద్ధ సమయంలో వాయుసేన వందలాది స్ట్రైక్‌, నిఘా, ఎస్కార్ట్‌ మిషన్లు నిర్వహించి పాక్‌ సరఫరా మార్గాలను దెబ్బతీసింది. గోల్డెన్‌ యారోస్‌లో బీఎస్‌ ధనోవా, స్క్వాడ్రన్‌ లీడర్‌ అజయ్‌ అహుజా, ఫ్లయింగ్‌ ఆఫీసర్‌ రాజ్‌పాల్‌ సింగ్‌ ధలీవాల్‌ తదితరులు కీలక పాత్ర పోషించారు. వారి సాహసం కార్గిల్‌ యుద్ధ చరిత్రలో చిరస్థాయిగా నిలిచింది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
చెన్నైలో ఏఆర్ రెహ్మాన్ కుమారుడుకి కారు ప్రమాదం

చెన్నైలో ఏఆర్ రెహ్మాన్ కుమారుడుకి కారు ప్రమాదం

ఉత్తరాఖండ్‌లోని ఉత్తరకాశీలో భూ ప్రకంపనలు

ఉత్తరాఖండ్‌లోని ఉత్తరకాశీలో భూ ప్రకంపనలు

ఏఐ ఉద్యోగాలకూ లేఆఫ్స్‌ భయం..

ఏఐ ఉద్యోగాలకూ లేఆఫ్స్‌ భయం..

నా అల్లుడు 25 పెళ్లిళ్లు చేసుకున్నాడు...బీజేపీ ఎమ్మెల్యే ఆరోపణలు

నా అల్లుడు 25 పెళ్లిళ్లు చేసుకున్నాడు...బీజేపీ ఎమ్మెల్యే ఆరోపణలు

న్యూఢిల్లీ పర్యటనలో పర్యాటక మంత్రి కందుల దుర్గేష్

న్యూఢిల్లీ పర్యటనలో పర్యాటక మంత్రి కందుల దుర్గేష్

సీట్‌బెల్ట్‌ పెట్టుకోని చిన్నారి.. టేకాఫ్‌ కాకుండానే వెనక్కి వెళ్లిన విమానం

సీట్‌బెల్ట్‌ పెట్టుకోని చిన్నారి.. టేకాఫ్‌ కాకుండానే వెనక్కి వెళ్లిన విమానం

ట్యాగ్లు
ఆపరేషన్‌ సఫేద్‌ సాగర్‌కార్గిల్‌ యుద్ధంభారత వాయుసేనగోల్డెన్‌ యారోస్‌మిరేజ్‌ 2000టైగర్‌ హిల్స్‌లేజర్‌ గైడెడ్‌ బాంబులుభారత్‌ ఇజ్రాయెల్‌ రక్షణ సహకారంఆపరేషన్‌ విజయ్‌కార్గిల్‌ వీరులు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ప్రియాంక మృతదేహానికి పోస్టుమార్టం పూర్తి
జనరల్

ప్రియాంక మృతదేహానికి పోస్టుమార్టం పూర్తి

హోటల్‌ ఫ్రీ వైఫైతో జాగ్రత్త - మైక్రోసాఫ్ట్‌ హెచ్చరిక
జనరల్

హోటల్‌ ఫ్రీ వైఫైతో జాగ్రత్త - మైక్రోసాఫ్ట్‌ హెచ్చరిక

కిరణ్ ‘ఇంద్రపుత్ర’లో ఏదో స్పెషల్ ఉంది!
సినిమాలు

కిరణ్ ‘ఇంద్రపుత్ర’లో ఏదో స్పెషల్ ఉంది!

లవ్లీనా బొర్గోహెయిన్‌ను అభినందించిన ప్రధాని మోదీ
క్రీడలు

లవ్లీనా బొర్గోహెయిన్‌ను అభినందించిన ప్రధాని మోదీ

చెన్నైలో ఏఆర్ రెహ్మాన్ కుమారుడుకి కారు ప్రమాదం
జనరల్

చెన్నైలో ఏఆర్ రెహ్మాన్ కుమారుడుకి కారు ప్రమాదం

ఉత్తరాఖండ్‌ ఉత్తరకాశీలో భూ ప్రకంపనలు
జనరల్

ఉత్తరాఖండ్‌ ఉత్తరకాశీలో భూ ప్రకంపనలు

వార్మప్‌ మ్యాచ్‌లో భారత ఆటగాళ్ల జోరు.. సితాన్షు కొటక్‌ ప్రశంసలు
క్రీడలు

వార్మప్‌ మ్యాచ్‌లో భారత ఆటగాళ్ల జోరు.. సితాన్షు కొటక్‌ ప్రశంసలు

ఆపరేషన్‌ సఫేద్‌ సాగర్‌ వెనుక అసలు కథ ఇదే!
జనరల్

ఆపరేషన్‌ సఫేద్‌ సాగర్‌ వెనుక అసలు కథ ఇదే!

‘స్లమ్‌ డాగ్‌’లో టబు పవర్‌ఫుల్‌ లుక్‌ రివీల్
సినిమాలు

‘స్లమ్‌ డాగ్‌’లో టబు పవర్‌ఫుల్‌ లుక్‌ రివీల్

ఏఐ ఉద్యోగాలకూ లేఆఫ్స్‌ భయం..
జనరల్

ఏఐ ఉద్యోగాలకూ లేఆఫ్స్‌ భయం..

కంగనా పార్లమెంట్ లుక్.. వస్తువుల ధరలు చూస్తే షాక్!
సినిమాలు

కంగనా పార్లమెంట్ లుక్.. వస్తువుల ధరలు చూస్తే షాక్!

‘హుషార్‌ పిట్టలు’ ట్రైలర్‌ విడుదల..
సినిమాలు

‘హుషార్‌ పిట్టలు’ ట్రైలర్‌ విడుదల..

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!