
జనరల్

తమిళగ వెట్రి కళగం (టీవీకే) అధ్యక్షుడు, తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ రాజకీయ, పాలనా సామర్థ్యాలపై అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి కె. పళనిస్వామి విమర్శలు చేశారు. తిరుప్పూర్ జిల్లా ధారాపురం నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయన.. విజయ్ 70 సినిమాల్లో నటించినప్పటికీ ఒక్క చిత్రానికి కూడా జాతీయ అవార్డు అందుకోలేదని వ్యాఖ్యానించారు.
సినిమాల్లో విజయ్ హీరోగా ఉన్నప్పటికీ, పాలన విషయానికి వస్తే ఆయన ‘జీరో’ అని పళనిస్వామి వ్యాఖ్యానించారు. విజయ్ రాజకీయ రంగంలోకి వచ్చిన నేపథ్యంలో ఆయన సినీ ప్రస్థానాన్ని పాలనా సామర్థ్యంతో పోలుస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు. పళనిస్వామి వ్యాఖ్యలు తమిళనాడు రాజకీయాల్లో కొనసాగుతున్న అన్నాడీఎంకే–TVK మధ్య విమర్శలకు సంబంధించినవిగా ఉన్నాయి.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!