

అమరావతిని డీప్‌టెక్, ఆవిష్కరణల కేంద్రంగా అభివృద్ధి చేసే దిశగా పాన్ ఐఐటీ ఆంధ్రప్రదేశ్ సమ్మిట్ 2026 కీలక డిక్లరేషన్‌కు వేదికైంది. విజయవాడలో జరిగిన ఈ సదస్సులో ఏపీ ప్రభుత్వం, పాన్ ఐఐటీ అలుమ్ని ఇండియా ప్రతినిధులు డిక్లరేషన్‌పై సంతకాలు చేశారు. అమరావతిలో శాశ్వత పాన్ ఐఐటీ అమరావతి కౌన్సిల్‌ను ఏర్పాటు చేసి, డీప్‌టెక్ అభివృద్ధికి నోడల్ సంస్థగా పనిచేయించాలని నిర్ణయించారు. స్టార్టప్‌లు, ఆవిష్కరణలు, పెట్టుబడులకు మద్దతుగా రూ.500 కోట్ల పాన్ ఐఐటీ అమరావతి వెంచర్ ఫండ్‌ను ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు.
23 ఐఐటీల నుంచి సాంకేతిక పరిజ్ఞానాన్ని గుర్తించి ఏపీలో టెక్నాలజీ ట్రాన్స్‌ఫర్‌కు ప్రాధాన్యం ఇవ్వనున్నారు. పరిశ్రమల భాగస్వామ్యంతో 10 ఇండస్ట్రీ ఛైర్స్, స్టార్టప్‌లకు మార్గనిర్దేశం చేసేందుకు 100 మంది గ్లోబల్ ఐఐటీ మెంటార్ల నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. 2030 నాటికి కనీసం 50 స్టార్టప్‌లను ఇంక్యుబేట్ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. క్వాంటమ్-ఏఐ, సెమీకండక్టర్లు, స్పేస్-డిఫెన్స్, హెల్త్, అగ్రిటెక్, బ్లూ వాటర్ ఎకానమీ వంటి రంగాల్లో పెట్టుబడులను ఆకర్షించేందుకు డీప్‌టెక్ పాలసీ ప్యాకేజీని అమలు చేయనున్నారు. రాష్ట్రంలోని 10 విశ్వవిద్యాలయాలను పాన్ ఐఐటీ ఎకోసిస్టంతో అనుసంధానం చేసి అమరావతిని పరిశోధన, టెక్నాలజీ ట్రాన్స్‌ఫర్, స్టార్టప్ అభివృద్ధికి కేంద్రంగా తీర్చిదిద్దే లక్ష్యాన్ని డిక్లరేషన్‌లో పేర్కొన్నారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!