
జనరల్

గోదావరి నదిలోని ప్రకృతి అందాలను ఆస్వాదించాలనుకునే పర్యాటకులకు శుభవార్త. ప్రముఖ పర్యాటక ప్రాంతమైన పాపికొండలకు బోటు విహారయాత్రలు రేపటి నుంచి తిరిగి ప్రారంభం కానున్నాయి. దేవీపట్నం మండలంలోని గండిపోచమ్మ గుడి రేవు నుంచి పర్యాటక బోట్ల రాకపోకలకు అధికారులు అనుమతి ఇచ్చారు. దీంతో పాపికొండలను సందర్శించాలనుకునే పర్యాటకులకు మరోసారి విహారయాత్ర చేసే అవకాశం లభించనుంది.
పర్యాటకుల భద్రతను దృష్టిలో ఉంచుకుని బోట్ల ఫిట్నెస్, భద్రతా ప్రమాణాలను అధికారులు పూర్తిగా తనిఖీ చేసిన తర్వాతే ప్రయాణాలకు అనుమతి ఇస్తున్నారు. బోటు నిర్వాహకులు నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని సూచించారు. పాపికొండల యాత్రకు వెళ్లే పర్యాటకులు ప్రయాణానికి ముందు స్థానిక అధికారుల సూచనలు, బోటు సేవలకు సంబంధించిన తాజా వివరాలను తెలుసుకోవడం మంచిది.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!