
జనరల్

భావ ప్రకటన స్వేచ్ఛ రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కే అయినప్పటికీ, అది అపరిమితమైన హక్కు కాదని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. ప్రజాస్వామ్యంలో ప్రశ్నించే హక్కును ప్రభుత్వం గౌరవిస్తుందని, సద్విమర్శలను స్వాగతిస్తామని పేర్కొన్నారు. అయితే వ్యక్తిగత దూషణలు, హత్య బెదిరింపులు, నిరాధార ఆరోపణలు, మత విశ్వాసాలను దెబ్బతీసే పోస్టులు చేస్తే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.
సోషల్ మీడియా ఫిర్యాదుల పరిష్కారం కోసం ఉప ముఖ్యమంత్రి కార్యాలయంలో ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. స్క్రీన్‌షాట్‌లు, లింకులు, వీడియోలు వంటి డిజిటల్ ఆధారాలతో ఫిర్యాదులు చేయవచ్చన్నారు. అవసరమైతే సోషల్ మీడియా దుర్వినియోగాన్ని అరికట్టేందుకు కొత్త చట్టాలు, ప్రత్యేక టాస్క్‌ఫోర్స్ తీసుకురావడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని పవన్ కళ్యాణ్ వెల్లడించారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!