

ప్రభుత్వ పథకాల కింద లబ్ధిదారులకు అందించే ప్రత్యక్ష ప్రయోజన బదిలీ సేవలు మరింత సులభతరం కానున్నాయి. వివిధ ప్రభుత్వ పథకాల ద్వారా అందించే నగదు, సబ్సిడీలను లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలకు నేరుగా బదిలీ చేసే పబ్లిక్ ఫైనాన్షియల్ మేనేజ్‌మెంట్ సిస్టమ్ (పీఎఫ్‌ఎంఎస్)కు ఆధార్ ఆధారిత ధ్రువీకరణలో కీలక గుర్తింపు లభించింది. అత్యంత వేగంగా ఆధార్ ధ్రువీకరణ వినియోగదారు సంస్థగా చేరిన సంస్థల్లో ఒకటిగా పీఎఫ్‌ఎంఎస్‌కు యూఐడీఏఐ ప్రత్యేక గుర్తింపు ఇచ్చింది.
కేంద్ర ఆర్థికశాఖ వ్యయ విభాగం పరిధిలో, కంట్రోలర్ జనరల్ ఆఫ్ అకౌంట్స్ ఆధ్వర్యంలో పీఎఫ్‌ఎంఎస్ పనిచేస్తోంది. బ్యాంకులు, ఇతర ఆర్థిక వ్యవస్థలతో ఇప్పటికే అనుసంధానమై ఉన్న పీఎఫ్‌ఎంఎస్ డిజిటల్ చెల్లింపులు, నిధుల బదిలీ, ఆర్థిక నివేదికల నిర్వహణలో కీలక పాత్ర పోషిస్తోంది. తాజాగా ఆధార్ ధ్రువీకరణ వినియోగదారు సంస్థ హోదా లభించడంతో లబ్ధిదారుల గుర్తింపును నిర్ధారించేందుకు వన్‌టైమ్ పాస్‌వర్డ్, బయోమెట్రిక్ వంటి ఆధార్ ధ్రువీకరణ సేవలను నేరుగా వినియోగించుకునే అధికారిక అనుసంధానం ఏర్పడింది. దీంతో డీబీటీ సేవలు మరింత సమర్థంగా, సులభంగా అందే అవకాశం ఉంది.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!