

అగ్రిగోల్డ్ బాధితులకు గుడ్‌న్యూస్. రూ.447 కోట్ల అగ్రిగోల్డ్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. అగ్రిగోల్డ్ బాండ్ల వెరిఫికేషన్‌కు సంబంధించి సీఐడీ షెడ్యూల్‌ను విడుదల చేసింది. బాండ్ల పరిశీలన కోసం తేదీలను ఖరారు చేయడంతో పాటు, రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాటు చేసిన వెరిఫికేషన్ కేంద్రాల వివరాలను ప్రకటించింది. బాధితులకు ఇబ్బందులు కలగకుండా జిల్లాలు, మండలాల వారీగా వెరిఫికేషన్ షెడ్యూల్‌ను రూపొందించింది.
నవంబర్ 25 నుంచి రాష్ట్రవ్యాప్తంగా 10 కేంద్రాల్లో బాండ్ల వెరిఫికేషన్ ప్రక్రియ ప్రారంభం కానుంది. ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా 1.65 లక్షల మంది అగ్రిగోల్డ్ బాధితులను గుర్తించినట్లు సీఐడీ వెల్లడించింది. ఈ ప్రక్రియ ప్రారంభం కానుండటంతో తమ బాండ్ల పరిశీలన కోసం ఎదురుచూస్తున్న బాధితుల్లో ఆశలు చిగురిస్తున్నాయి. ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి ముగ్గురు నిందితులను సీఐడీ అరెస్ట్ చేసింది.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!