
షోస్

ప్రధాని నరేంద్ర మోదీ ఫిలిప్పీన్స్ పర్యటనలో భాగంగా ఆ దేశ రాజధాని మనీలాకు చేరుకున్నారు. మనీలాలో అడుగుపెట్టిన ప్రధానికి ఘనస్వాగతం లభించింది. మూడు రోజుల పాటు కొనసాగనున్న ఈ పర్యటనలో భాగంగా మోదీ పలు కీలక సమావేశాల్లో పాల్గొననున్నారు. మనీలాలో జరగనున్న 23వ ఆసియాన్-భారత్ సదస్సులోనూ ఆయన పాల్గొంటారు.
ఈ పర్యటనలో భాగంగా రేపు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో ప్రధాని మోదీ సమావేశం కానున్నారు. మనీలాలో జరగనున్న ఈ భేటీతో పాటు ఇతర క్వాడ్ దేశాల అధినేతలతోనూ మోదీ సమావేశమయ్యే అవకాశం ఉంది. ఈ పర్యటనలో ప్రాంతీయ సహకారం, అంతర్జాతీయ సంబంధాలు, వ్యూహాత్మక భాగస్వామ్యాలపై కీలక చర్చలు జరిగే అవకాశం ఉంది.



కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!