
క్రీడలు

రాజమహేంద్రవరంలో మద్యం మత్తులో యువకులు నడిపిన కారు ఢీకొనడంతో మృతి చెందిన మెడికో ప్రియాంక తండ్రి వెంకటేశ్ పోలీసులపై ప్రశంసలు కురిపించారు. ఈ కేసులో పోలీసులు సత్వరమే స్పందించారని తెలిపారు. అయితే కొన్ని ఛానళ్లు ఈ ఘటనపై వార్తలను వక్రీకరిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. తానెక్కడా ప్రభుత్వాన్ని, పోలీసులను తప్పుపట్టలేదని స్పష్టం చేశారు.
కుమార్తెను కోల్పోయిన బాధలో ఉన్న తమ కుటుంబాన్ని మరింత బాధపెట్టేలా వార్తలు ప్రసారం చేయవద్దని వెంకటేశ్ చేతులు జోడించి మీడియాకు విజ్ఞప్తి చేశారు. ఇప్పటికే తీవ్ర విషాదంలో ఉన్న తమ కుటుంబం పట్ల సున్నితంగా వ్యవహరించాలని కోరారు. ఘటనకు సంబంధించిన వాస్తవాలను మాత్రమే ప్రసారం చేయాలని, తన వ్యాఖ్యలను ప్రభుత్వం లేదా పోలీసులపై విమర్శలుగా భావించవద్దని స్పష్టం చేశారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!