

1980ల నాటి సికింద్రాబాద్ నేపథ్యంలో తెరకెక్కిన నాని ది పారడైజ్ చిత్రానికి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభిస్తోంది. అణచివేత, బానిసత్వానికి వ్యతిరేకంగా హక్కుల కోసం పోరాడే ‘జడల్’ అనే శక్తివంతమైన పాత్రలో నాని తన నటనతో ఆకట్టుకున్నారు. ఆయన సీరియస్ నటన, యాక్షన్ సన్నివేశాలు, అనిరుధ్ రవిచందర్ అందించిన నేపథ్య సంగీతం సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయని ప్రేక్షకులు ప్రశంసిస్తున్నారు. కథానాయిక కయాదు లోహర్ తన పాత్ర పరిధిలో ఆకట్టుకోగా, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కథను తెరకెక్కించిన విధానానికి ప్రశంసలు దక్కుతున్నాయి.
అయితే సినిమా ద్వితీయార్థం, ఎడిటింగ్ విషయంలో కొంత మిశ్రమ స్పందన వినిపిస్తోంది. అయినప్పటికీ బాక్సాఫీస్ వద్ద వసూళ్ల జోరు కొనసాగుతోంది. నాని కెరీర్‌లోనే అత్యధిక ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ చేసిన చిత్రంగా నిలిచిన ది పారడైజ్, అడ్వాన్స్ బుకింగ్స్‌లోనూ రికార్డులు నమోదు చేసినట్లు సమాచారం. ఉత్తర అమెరికా ప్రీ సేల్స్ ద్వారా 1.4 మిలియన్ డాలర్లకు పైగా వసూలు చేసినట్లు చిత్ర బృందం తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే రూ.60 కోట్ల మార్కును దాటినట్లు పేర్కొంది. ప్రీమియర్స్, తొలిరోజు వసూళ్లు కలిపి రూ.100 కోట్ల క్లబ్‌లో చేరే అవకాశం ఉందని వాణిజ్య వర్గాలు అంచనా వేస్తున్నాయి.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!