

సైబర్ నేరాల నుంచి పిల్లలను రక్షించడంతో పాటు వారికి సత్వర న్యాయం అందేలా సమగ్ర చైల్డ్ ఆన్‌లైన్ సేఫ్టీ ఫ్రేమ్‌వర్క్‌ను రూపొందించాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. హైదరాబాద్‌లో జరిగిన నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ దక్షిణ మండల ప్రాంతీయ సదస్సులో ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ హైకోర్టు, రాష్ట్ర న్యాయసేవాధికార సంస్థతో సంప్రదించి ఈ కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేయాలని సూచించారు. పిల్లలు ఇంటర్నెట్‌లో ఏం చేస్తున్నారో తల్లిదండ్రులు ప్రేమతో, అవగాహనతో తెలుసుకోవాలని, సైబర్ నేరాల నివారణకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని అన్నారు.
పిల్లల రక్షణ కోసం పోలీసు విభాగం, భరోసా కేంద్రాలు, చైల్డ్ ప్రొటెక్షన్ యూనిట్లు, సంక్షేమ కమిటీలు, ప్రత్యేక కోర్టులు, న్యాయసేవాధికార సంస్థలు సమష్టిగా పనిచేయాలని సీఎం సూచించారు. హైదరాబాద్‌లో దేశంలోనే తొలి చైల్డ్ ఫ్రెండ్లీ కోర్టు ఏర్పాటు చేశామని, 3,000 మందికి పైగా చైల్డ్ ప్రొటెక్షన్ అధికారులకు శిక్షణ ఇచ్చినట్లు తెలిపారు. సైబర్ నేరాల కోసం 1930, చైల్డ్ హెల్ప్‌లైన్ కోసం 1098 నంబర్లను పిల్లలు, తల్లిదండ్రులు గుర్తుంచుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా ‘న్యాయరథం’ మొబైల్ లోక్ అదాలత్ వాహనాలను ప్రారంభించడంతో పాటు ‘కమిట్‌మెంట్ వాల్’ను ఆవిష్కరించారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!