

మధ్యప్రదేశ్‌లోని బాలాఘాట్ జిల్లాలో అనారోగ్యంతో మృతిచెందిన గిరిజన పిల్లల కుటుంబాలను లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీ గురువారం పరామర్శించారు. మహారాష్ట్రలోని గోండియా నుంచి రోడ్డు మార్గంలో బాలాఘాట్‌కు చేరుకున్న ఆయన, బైహర్ ప్రాంతంలోని గిరిజన కుటుంబాలతో సుమారు గంటపాటు మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. గత కొన్ని నెలల్లో 30 మందికి పైగా గిరిజన పిల్లలు వివిధ అనారోగ్య సమస్యలతో మృతిచెందినట్లు వార్తలు వెలువడ్డాయి. అధికారిక నివేదికల్లో మలేరియా, తట్టు, పోషకాహార లోపం, రక్తహీనత, శ్వాస సంబంధిత సమస్యలు, డీహైడ్రేషన్ వంటి పలు ఆరోగ్య కారణాలు ప్రస్తావించబడ్డాయి.
ఈ ఘటనలపై రాహుల్‌గాంధీ రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలపై ఆరోపణలు చేశారు. గిరిజన ప్రాంతాల్లో ఆరోగ్య సేవలు, పోషకాహారం, విద్య వంటి మౌలిక సదుపాయాలపై మరింత దృష్టి అవసరమని పేర్కొన్నారు. అనంతరం మాతె గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలను సందర్శించిన ఆయన, విద్యార్థులకు అందుతున్న మధ్యాహ్న భోజనం, పాఠశాల పరిస్థితులపై ఆరా తీశారు. కాగా, పిల్లల మరణాల సంఖ్య, వాటికి ఖచ్చితమైన వైద్య కారణాలపై అధికారిక వివరాలు, రాజకీయ పార్టీల వాదనల్లో తేడాలు ఉన్నట్లు నివేదికలు పేర్కొంటున్నాయి.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!