
షోస్

రాప్తాడు కేసులో నిందితుడిగా ఉన్న హేమంత్ ఆరోగ్యం క్రమంగా మెరుగుపడుతోంది. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు కర్నూలు ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి (జీజీహెచ్) సూపరింటెండెంట్ వెంకటేశ్వర్లు వెల్లడించారు. ప్రత్యేక వైద్య బృందం పర్యవేక్షణలో హేమంత్‌కు చికిత్స అందిస్తున్నారు. అయితే, మెరుగైన వైద్య పర్యవేక్షణ కోసం ఆయనను ఇంకా కార్డియాక్ ఐసీయూలోనే ఉంచారు.
హేమంత్ పల్మనరీ ఎంబాలిజం సమస్యతో బాధపడుతున్నట్లు వైద్యులు తెలిపారు. ఈ పరిస్థితిలో ఊపిరితిత్తులకు రక్తాన్ని తీసుకెళ్లే రక్తనాళాల్లో రక్తం గడ్డకట్టడం వల్ల రక్తప్రసరణకు ఆటంకం ఏర్పడుతుంది. ఊపిరితిత్తులకు రక్తప్రసరణ మెరుగుపరిచేందుకు వైద్యులు ప్రత్యేక ఇంజక్షన్లు ఇస్తున్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని, వైద్య బృందం నిరంతరం పర్యవేక్షిస్తోందని ఆసుపత్రి సూపరింటెండెంట్ పేర్కొన్నారు.



కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!