

మైక్రోసాఫ్ట్‌లో సీనియర్ ఎగ్జిక్యూటివ్‌గా పనిచేస్తున్న రవి వేడుల రచించిన Hyderabad Days: The Code We Lived By Before We Coded పుస్తకం హైదరాబాద్ నగరంలోని 1980, 1990 దశకాల జ్ఞాపకాలను మరోసారి గుర్తుచేస్తోంది. అప్పటి కాలనీ సంస్కృతి, వీధుల్లో క్రికెట్ ఆటలు, చిన్ననాటి స్నేహాలు, బాల్యంలోని మధురమైన అనుభవాలను ఈ పుస్తకం ద్వారా పాఠకుల ముందుకు తీసుకొచ్చారు. సాంకేతికత రోజువారీ జీవితంలో భాగం కాకముందు హైదరాబాద్‌లో పెరిగిన ఓ తరం జీవనశైలిని, అప్పటి వాతావరణాన్ని రచయిత తన జ్ఞాపకాల రూపంలో అక్షరబద్ధం చేశారు. ఈ పుస్తకం ద్వారా పాఠకులు తమ బాల్యాన్ని, నగరంతో ముడిపడిన అనుభూతులను మరోసారి గుర్తుచేసుకునే అవకాశం కలుగుతోంది.
ఈ పుస్తకానికి సంబంధించిన మొత్తం ఆదాయాన్ని H2H ఫౌండేషన్ చేపడుతున్న ఆరోగ్య సేవా కార్యక్రమాలకు విరాళంగా అందించాలని రవి వేడుల నిర్ణయించారు. తమ నగర జ్ఞాపకాలను ఆస్వాదించడంతో పాటు ఒక మంచి సామాజిక కార్యక్రమానికి తోడ్పడే అవకాశం కల్పిస్తున్న ఈ ప్రయత్నం అభినందనీయం. హైదరాబాద్ వాసులంతా ఒక్కటై రవి రచనకు మద్దతు ఇవ్వాలని, పుస్తకాన్ని ఆదరించాలని, ఫౌండేషన్ ఆరోగ్య సేవలకు తమ వంతు సహకారం అందించాలని పిలుపునిస్తున్నారు. ఇలా హైదరాబాద్ గత జ్ఞాపకాలను పంచుకోవడంతో పాటు సమాజానికి మేలు చేసే లక్ష్యంతో ఈ పుస్తకం ముందుకొచ్చింది.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!