

తెలంగాణలో బియ్యం ధరలు భారీగా పెరగడంతో సామాన్య ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా సన్నబియ్యం ధరలు మార్కెట్‌లో కిలోకు రూ.85 నుంచి రూ.100 వరకు పలుకుతున్నాయి. ఎల్ నినో ప్రభావంతో పంట దిగుబడి తగ్గిందనే కారణంతో కొందరు వ్యాపారులు కృత్రిమ కొరత సృష్టిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో బియ్యం ధరలను నియంత్రించేందుకు ప్రభుత్వం రంగంలోకి దిగింది. టాస్క్‌ఫోర్స్ బృందాలతో మార్కెట్లు, మిల్లుల్లో తనిఖీలు చేపడుతోంది.
మరోవైపు, సన్నబియ్యం ధరల నియంత్రణకు ప్రభుత్వం రకాలవారీగా కిలోకు రూ.66 నుంచి రూ.79 వరకు గరిష్ఠ చిల్లర ధర (MRP) నిర్ణయించింది. నిర్ణయించిన ధరలకు మించి విక్రయాలు జరిపినా, కృత్రిమ కొరత సృష్టించినా కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరిస్తున్నారు. నిబంధనలు ఉల్లంఘించే మిల్లర్లు, వ్యాపారులపై పీడీ యాక్ట్ కింద కేసులు నమోదు చేస్తామని స్పష్టం చేస్తున్నారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!