

రాష్ట్రపతి ఎయిడ్-డి-క్యాంప్‌గా పనిచేసిన మాజీ మేజర్ రిషభ్ సింగ్ సంబ్యాల్ ప్రస్తుతం ఫ్యాషన్ రంగంలోకి అడుగుపెట్టారు. వ్యక్తిగత కారణాలతో ఇటీవల భారత సైన్యాన్ని వీడిన ఆయన, తాజాగా ఓ ఫ్యాషన్ దుస్తుల సంస్థకు మోడల్‌గా మారారు. ఆ సంస్థ ప్రచార కార్యక్రమంలో నటి అనుష్క సేన్‌తో కలిసి పాల్గొన్నారు. ఆర్మీలో సేవలందించిన సమయంలోనే సోషల్ మీడియాలో గుర్తింపు పొందిన రిషభ్‌కు, సైన్యాన్ని వీడిన తర్వాత కూడా నెటిజన్లలో ఉన్న ఆదరణ కొనసాగుతోంది.
32 ఏళ్ల రిషభ్ సింగ్ సంబ్యాల్ 2014లో నేషనల్ డిఫెన్స్ అకాడమీ (NDA)లో చేరారు. అక్కడ మిలిటరీ స్టడీస్, డిఫెన్స్ మేనేజ్‌మెంట్‌లో శిక్షణ పొందారు. 2021 గణతంత్ర దినోత్సవ పరేడ్‌లో కెప్టెన్‌గా జాట్ రెజిమెంట్ దళానికి నాయకత్వం వహించారు. 2023లో రాష్ట్రపతి ఎయిడ్-డి-క్యాంప్‌గా ఎంపికయ్యారు. రాష్ట్రపతి అధికారిక కార్యక్రమాల్లో తరచూ కనిపించడంతో ఆయనకు సోషల్ మీడియాలో ప్రత్యేక గుర్తింపు లభించింది. తాజాగా ఫ్యాషన్ రంగంలోకి అడుగుపెట్టడంతో ఆయన తదుపరి ప్రయాణంపై ఆసక్తి నెలకొంది.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!