

పశ్చిమ బెంగాల్‌లో రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్‌ఎస్‌ఎస్) సంస్థాగత విస్తరణకు ప్రత్యేక కార్యాచరణ చేపట్టింది. 2026 అక్టోబర్ 10న మహాలయ నాటికి రాష్ట్రంలో శాఖల సంఖ్యను 10 వేలకు పెంచాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఆర్‌ఎస్‌ఎస్ ప్రతినిధుల ప్రకారం.. ఈ ఏడాది మే నాటికి బెంగాల్‌లో సుమారు 5 వేల శాఖలు ఉండగా, ఆ తర్వాత వాటి సంఖ్య పెరిగింది. విస్తరణలో భాగంగా అక్టోబర్ 1 నుంచి 10 వరకు రాష్ట్రవ్యాప్తంగా ప్రత్యేక అవుట్‌రీచ్ కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు సంస్థ వెల్లడించింది.
ఈ కార్యక్రమంలో యువతపై, ముఖ్యంగా Gen Zపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు సమాచారం. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో యువజన సదస్సులు, అవుట్‌రీచ్ కార్యక్రమాలు నిర్వహించి యువతను సంస్థ కార్యకలాపాలకు అనుసంధానించాలని ఆర్‌ఎస్‌ఎస్ భావిస్తోంది. గ్రామాలు, పట్టణాల్లో సంస్థాగత నెట్‌వర్క్‌ను మరింత బలోపేతం చేయడం ఈ కార్యక్రమం లక్ష్యంగా పేర్కొంటున్నారు. బెంగాల్‌లో ఆర్‌ఎస్‌ఎస్ కార్యకలాపాల విస్తరణ రాజకీయ, సామాజిక చర్చకు దారితీస్తుండగా.. సంస్థ మాత్రం దీనిని ప్రధానంగా తన సంస్థాగత విస్తరణ, ప్రజలతో అనుసంధాన కార్యక్రమంగా వివరిస్తోంది.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!