
షోస్

తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా నిర్వహించిన గజవాహన సేవలో ఓ రష్యన్ భక్తుడు భక్తిపారవశ్యంలో మునిగిపోయారు. స్వామివారి వైభవాన్ని ప్రత్యక్షంగా వీక్షించిన ఆయన.. ‘గోవిందా.. గోవిందా’ అంటూ శ్రీవారి నామస్మరణ చేశారు. తిరుమల భూవైకుంఠంలా అనిపించిందని పేర్కొన్న ఆయన.. భక్తులు ఎంతో శ్రమతో, భక్తిశ్రద్ధలతో స్వామివారికి సేవలు అందించడం తనను ఎంతగానో ఆకట్టుకుందని తెలిపారు.
తిరుమలలో భగవంతుడిపై భక్తులకు ఉన్న అపారమైన విశ్వాసం ప్రపంచానికి ఆధ్యాత్మిక సందేశాన్ని అందిస్తోందని ఆ రష్యన్ భక్తుడు అన్నారు. తిరుపతికి రావడం ఇదే తొలిసారి అని తెలిపిన ఆయన.. శ్రీవారి బ్రహ్మోత్సవాల వైభవాన్ని చూసి ఎంతో ఆనందం వ్యక్తం చేశారు. చివరగా ‘గోవిందా.. గోవిందా’ అంటూ నినదిస్తూ శ్రీవారిపై తన భక్తిని చాటుకున్నారు.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!