

ఎమర్జెన్సీ మెడిసిన్‌లో ఎండీ పూర్తి చేసి, ఈ ఘనత సాధించిన దేశంలోని తొలి ట్రాన్స్ మహిళగా నిలిచిన డాక్టర్ కొయ్యల రూత్ జాన్ పాల్‌ను హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ సత్కరించారు. ఎన్నో కష్టాలు, వివక్షను ఎదుర్కొన్నప్పటికీ ఆమె పట్టుదలతో చదువును కొనసాగించి, న్యాయపోరాటం చేస్తూ పీజీ పూర్తి చేయడం ప్రశంసనీయమని సజ్జనార్ పేర్కొన్నారు. ఆమె జీవన ప్రయాణం ధైర్యం, సంకల్పం, పట్టుదలకు నిదర్శనమని కొనియాడారు.
ప్రస్తుతం డాక్టర్ రూత్ జాన్ పాల్ హైదరాబాద్‌లోని సనత్‌నగర్ ఈఎస్ఐ ఆసుపత్రి అత్యవసర విభాగంలో సేవలందిస్తూ రోగుల ప్రాణాలను కాపాడుతున్నారు. అన్ని అవరోధాలను అధిగమించి తన లక్ష్యాన్ని చేరుకున్న ఆమె ప్రయాణం సమాజానికి స్ఫూర్తిదాయకమని సజ్జనార్ అన్నారు. డాక్టర్ రూత్ భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. ఈ ప్రయాణంలో ఆమెకు అండగా నిలిచిన ముకుంద మాల, వైజయంతి వసంత, రచన ముద్రబోయిన్లకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!