
షోస్

తమిళనాడులోని ప్రసిద్ధ పాంబన్ రైల్వే బ్రిడ్జిపై 24 గంటల వ్యవధిలో రెండో ప్రమాదకర ఘటన చోటుచేసుకుంది. అమృత ఎక్స్ప్రెస్లో ప్రయాణిస్తున్న ఓ మహిళ కదులుతున్న రైలు నుంచి సముద్రంలోకి దూకినట్లు సమాచారం. ఈ ఘటనలో ఆమె తీవ్రంగా గాయపడింది. వెంటనే స్పందించిన సహాయక సిబ్బంది, స్థానికులు ఆమెను అపస్మారక స్థితిలో రక్షించి చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు.
శనివారం రాత్రి కూడా ఇదే ప్రాంతంలో ఓ వ్యక్తి కదులుతున్న రైలు నుంచి దూకి ప్రాణాలు కోల్పోయినట్లు పోలీసులు తెలిపారు. రామేశ్వరం వెళ్లే మార్గంలో వరుసగా ఇలాంటి ఘటనలు చోటుచేసుకోవడం స్థానికంగా ఆందోళన కలిగిస్తోంది. ఈ రెండు ఘటనలకు సంబంధించిన పరిస్థితులు, కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!