

బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం క్రమంగా బలపడుతోంది. ప్రస్తుతం గంటకు 8 కిలోమీటర్ల వేగంతో కదులుతున్న ఈ వాతావరణ వ్యవస్థ చెన్నైకి 760 కిలోమీటర్లు, విశాఖపట్నానికి 870 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉన్నట్లు వాతావరణ శాఖ తాజా బులెటిన్ వెల్లడించింది. నవంబర్ 16 సాయంత్రానికి ఇది తుఫాన్‌గా మారే అవకాశం ఉంది. అనంతరం నవంబర్ 17న తీవ్ర తుఫాన్‌గా, నవంబర్ 18 నుంచి అతి తీవ్ర తుఫాన్‌గా బలపడే సూచనలున్నాయి. తుఫాన్‌గా మారిన తర్వాత దీనికి ‘అక్వాన్’ (Akvan) అని పేరు పెట్టనున్నారు. నవంబర్ 19 నాటికి గంటకు 120-130 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉండగా, గాలుల తీవ్రత మరింత పెరిగే సూచనలున్నాయి.
ఈ తుఫాన్ ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లో నవంబర్ 18 నుంచి వర్షాలు కురిసే అవకాశం ఉంది. నవంబర్ 19, 20 తేదీల్లో ఉత్తర కోస్తా ఆంధ్రలో భారీ నుంచి అతి భారీ వర్షాలు, అక్కడక్కడ అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. సముద్రం అల్లకల్లోలంగా మారే అవకాశం ఉండటంతో మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లవద్దని అధికారులు సూచించారు. తుఫాన్ ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకుని తీర ప్రాంతాల్లో ముందస్తు జాగ్రత్తలు చేపడుతున్నారు.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!