
క్రీడలు

శంషాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో కడపకు వెళ్లాల్సిన ఇండిగో విమానంలో ఓ ప్రయాణికుడు హల్‌చల్ చేసిన ఘటన కలకలం రేపింది. శుక్రవారం తెల్లవారుజామున విమానం టేకాఫ్‌కు సిద్ధమవుతున్న సమయంలో సదరు ప్రయాణికుడు ఎమర్జెన్సీ డోర్‌ను తెరిచేందుకు ప్రయత్నించినట్లు సమాచారం. విషయాన్ని గమనించిన క్యాబిన్ సిబ్బంది వెంటనే అప్రమత్తమై అతడిని అడ్డుకున్నారు. దీంతో పెను ప్రమాదం తప్పింది.
అనంతరం ఆ ప్రయాణికుడిని ఆర్జీఐఏ పోలీసులకు అప్పగించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఎమర్జెన్సీ డోర్ తెరిచేందుకు అతడు ఎందుకు ప్రయత్నించాడనే విషయంపై అధికారులు ఆరా తీస్తున్నారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు దర్యాప్తు అనంతరం వెల్లడయ్యే అవకాశం ఉంది.




కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!