
సినిమాలు

తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) పార్టీలో నెలకొన్న రాజకీయ పరిణామాల మధ్య సీనియర్ నటుడు, ఎంపీ శతృఘ్న సిన్హా పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి బహిరంగ మద్దతు ప్రకటించారు. పార్టీని వీడుతున్నారన్న ప్రచారాన్ని ఖండించిన ఆయన, ఎలాంటి పరిస్థితుల్లోనూ మమతాను మోసం చేయనని, టీఎంసీని విడిచిపెట్టనని స్పష్టం చేశారు.
అసన్‌సోల్ లోక్‌సభ సభ్యుడిగా కొనసాగుతున్న శతృఘ్న సిన్హా, 2019 ఎన్నికల పరాజయం తర్వాత మమతా బెనర్జీ తనకు అండగా నిలిచారని గుర్తు చేసుకున్నారు. తనకు అవసరమైన సమయంలో మద్దతు ఇచ్చిన నాయకురాలిని కష్టకాలంలో విడిచిపెట్టడం తనకు సాధ్యం కాదన్నారు. తిరుగుబాటు ఎంపీలు, ఇతర రాజకీయ పార్టీల నుంచి ఆహ్వానాలు వచ్చినప్పటికీ వాటిని తిరస్కరించినట్లు వెల్లడిస్తూ, తాను టీఎంసీతోనే కొనసాగుతానని స్పష్టం చేశారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!