

రాత్రి నిద్రించే సమయంలో గదిలో ఉండే వెలుతురు గుండె ఆరోగ్యంపై ప్రభావం చూపే అవకాశం ఉందని యూరోపియన్ హార్ట్ జర్నల్‌లో ప్రచురితమైన తాజా పరిశోధన సూచించింది. 3 లక్స్ కంటే ఎక్కువ వెలుతురు ఉన్న గదిలో నిద్రించే వారిలో గుండె కండరాలు, ఎడమ జఠరిక గోడలు మందంగా ఉన్నట్లు పరిశోధకులు గుర్తించారు. స్మార్ట్‌ఫోన్ స్క్రీన్, డిజిటల్ క్లాక్ వెలుతురు, కిటికీలోంచి వచ్చే వీధి దీపాల కాంతి వంటివి రాత్రి సమయంలో వెలుతురు పెరగడానికి కారణం కావచ్చు.
రాత్రి సమయంలో అధిక వెలుతురు నిద్రకు ఆటంకం కలిగించడంతో పాటు శరీరంలోని సహజ హార్మోన్ల చక్రంపై ప్రభావం చూపే అవకాశం ఉంది. నిద్ర నాణ్యత తగ్గడం, రక్తపోటులో మార్పులు వంటి అంశాలు గుండె ఆరోగ్యంపై ప్రభావం చూపవచ్చు. అయితే అధ్యయనంలో కనిపించిన సంబంధం ఆధారంగా రాత్రి వెలుతురే నేరుగా గుండె జబ్బులకు కారణమవుతుందని నిర్ధారించలేం. పడుకునే సమయంలో గదిని వీలైనంత చీకటిగా ఉంచడం, నిద్రకు ముందు స్క్రీన్ వినియోగాన్ని తగ్గించడం, అవసరం లేని లైట్లను ఆపేయడం వంటి జాగ్రత్తలు మంచి నిద్రకు సహాయపడవచ్చు.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!