

ప్రయాణికుల రద్దీని తగ్గించేందుకు వివిధ మార్గాల్లో ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. ఈ మేరకు చర్లపల్లి–బరౌని ప్రత్యేక రైలు (07561/07562) నవంబర్ 23న మధ్యాహ్నం 2 గంటలకు చర్లపల్లిలో బయలుదేరి, 24వ తేదీ తెల్లవారుజామున 1.30 గంటలకు బరౌని చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో నవంబర్ 25న తెల్లవారుజామున 3 గంటలకు బరౌనిలో బయలుదేరి, మరుసటి రోజు సాయంత్రం 7 గంటలకు చర్లపల్లికి చేరుకుంటుంది.
రెక్సాల్–చర్లపల్లి ప్రత్యేక రైలు (05531/95532) నవంబర్ 21న సాయంత్రం 4.55 గంటలకు రెక్సాల్‌లో బయలుదేరి, రెండో రోజు ఉదయం 10 గంటలకు చర్లపల్లికి చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో నవంబర్ 23న రాత్రి 10 గంటలకు చర్లపల్లిలో బయలుదేరి, రెండో రోజు సాయంత్రం 7 గంటలకు రెక్సాల్ చేరుకుంటుంది. అలాగే, రెక్సాల్–చర్లపల్లి అన్‌రిజర్వ్‌డ్ ప్రత్యేక రైలు (05529/05530) నవంబర్ 22న సాయంత్రం 4.55 గంటలకు రెక్సాల్‌లో బయలుదేరి, రెండో రోజు ఉదయం 10 గంటలకు చర్లపల్లికి చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో నవంబర్ 24న రాత్రి 10 గంటలకు చర్లపల్లిలో బయలుదేరి, రెండో రోజు సాయంత్రం 7 గంటలకు రెక్సాల్ చేరుకోనుంది.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!