5, అక్టోబర్ 2026, సోమవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

విజయవాడలో ఫుడ్‌ సేఫ్టీ తనిఖీలు ముమ్మరం..

Writer: Chandrika 10:58 AM, 5 అక్టోబర్, 2026
విజయవాడలో ఫుడ్‌ సేఫ్టీ తనిఖీలు ముమ్మరం..

విజయవాడలో ఆహార భద్రతా నిబంధనల ఉల్లంఘనలపై అధికారులు చేపట్టిన తనిఖీల్లో పలు అంశాలు వెలుగులోకి వచ్చాయి. ఈట్‌స్ట్రీట్‌లోని ఓ ఫ్రైడ్‌ చికెన్‌ దుకాణంలో వంట నూనెను పదేపదే వినియోగిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. నిబంధనల ప్రకారం టోటల్‌ పోలార్‌ మెటీరియల్స్‌ (టీపీఎం) స్థాయి 25కు మించకూడదని అధికారులు పేర్కొంటుండగా.. అక్కడ 32 పాయింట్లుగా నమోదైంది. దీంతో కేసు నమోదు చేశారు. అంతకుముందు ఆహార భద్రత, తూనికలు-కొలతల శాఖల అధికారులు సంయుక్తంగా నిర్వహించిన తనిఖీల్లో అపరిశుభ్ర వాతావరణంలో ఆహార తయారీ, సరైన విధంగా నిల్వ చేయని పదార్థాలు, అధికంగా ఫుడ్‌ కలర్స్‌ వినియోగం, తేదీలు లేకుండా ఉత్పత్తుల విక్రయం వంటి ఉల్లంఘనలు గుర్తించినట్లు అధికారులు తెలిపారు. సుమారు 100 కిలోల నిల్వ చేసిన మాంసం, ఇతర బేకరీ పదార్థాలను స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు.

సత్యనారాయణపురం, గురునానక్‌ నగర్‌ తదితర ప్రాంతాల్లోని కొన్ని ఆహార విక్రయ కేంద్రాల్లోనూ నిబంధనల ఉల్లంఘనలు గుర్తించినట్లు అధికారులు తెలిపారు. సత్యనారాయణపురంలోని ఓ బేకరీకి అవసరమైన అనుమతులు లేవని, తేదీలు లేని బ్రెడ్‌, ఇతర పదార్థాలతో పాటు పాడైన పదార్థాలను శీతలీకరణ యంత్రాల్లో నిల్వ చేసినట్లు గుర్తించారు. బేకరీలో మాంసాహార పదార్థాల విక్రయానికి అనుమతి లేకపోయినా కొన్ని రోజులుగా నిల్వ చేసిన చికెన్‌ లభించినట్లు అధికారులు పేర్కొన్నారు. మరో రెస్టారెంట్‌లో కొన్ని రోజుల కిందట వండిన చికెన్‌, మటన్‌, అన్నం వంటి పదార్థాలను నిల్వ చేసి వినియోగదారులకు విక్రయిస్తున్నట్లు గుర్తించినట్లు తెలిపారు. ఆహార భద్రతా నిబంధనలను ఉల్లంఘించే సంస్థలపై నిరంతరం తనిఖీలు నిర్వహించి కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని అధికారులు చెబుతున్నారు. సిబ్బంది కొరత కారణంగా సాధారణ తనిఖీలు తగ్గుతున్నాయని, వినియోగదారుల ఫిర్యాదుల ఆధారంగానే పలు తనిఖీలు జరుగుతున్నాయని సమాచారం.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఎస్‌ఎల్‌బీసీ పనుల్లో కీలక ముందడుగు

ఎస్‌ఎల్‌బీసీ పనుల్లో కీలక ముందడుగు

సీబీఐ పగ్గాల నుంచి రాజకీయాల్లోకి.. నాగేశ్వరరావు కీలక నిర్ణయం

సీబీఐ పగ్గాల నుంచి రాజకీయాల్లోకి.. నాగేశ్వరరావు కీలక నిర్ణయం

ఆర్కిటిక్‌లో రష్యా, చైనా దూకుడుకు అమెరికా కౌంటర్..

ఆర్కిటిక్‌లో రష్యా, చైనా దూకుడుకు అమెరికా కౌంటర్..

ఫ్లైదుబాయ్ విమానాన్ని టెల్ అవీవ్‌లో కూల్చేందుకు కోపైలట్ కుట్ర?

ఫ్లైదుబాయ్ విమానాన్ని టెల్ అవీవ్‌లో కూల్చేందుకు కోపైలట్ కుట్ర?

తల్లికి వందనం రెండో విడతపై కీలక అప్‌డేట్
ట్యాగ్లు
విజయవాడ ఆహార భద్రతఆహార భద్రత ఉల్లంఘనలువిజయవాడ రెస్టారెంట్లునిల్వ చేసిన ఆహారంఆహార భద్రత తనిఖీలుఫుడ్ కలర్స్వాడిన నూనెబేకరీ ఉల్లంఘనలుఆహార భద్రత శాఖవినియోగదారుల భద్రత
Advertisement

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!

తల్లికి వందనం రెండో విడతపై కీలక అప్‌డేట్

కలెక్టర్లు, ఎస్పీలతో ఏపీ ఎస్ఈసీ కీలక సమావేశం

కలెక్టర్లు, ఎస్పీలతో ఏపీ ఎస్ఈసీ కీలక సమావేశం

Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
సీజేపీ నిరసనకు తుషార్ గాంధీ మద్దతు.. సీఈసీ రాజీనామాకు డిమాండ్
రాజకీయాలు

సీజేపీ నిరసనకు తుషార్ గాంధీ మద్దతు.. సీఈసీ రాజీనామాకు డిమాండ్

తిరుమల శ్రీవారి దర్శనంలో బోయపాటి శ్రీను..
సినిమాలు

తిరుమల శ్రీవారి దర్శనంలో బోయపాటి శ్రీను..

సింగరేణి కార్మికుల సమస్యలు పరిష్కరించాలి - కవిత
జనరల్

సింగరేణి కార్మికుల సమస్యలు పరిష్కరించాలి - కవిత

యూపీఐ ఛార్జీలపై కేంద్రాన్ని టార్గెట్ చేసిన కె. నారాయణ
రాజకీయాలు

యూపీఐ ఛార్జీలపై కేంద్రాన్ని టార్గెట్ చేసిన కె. నారాయణ

ఎస్‌ఎల్‌బీసీ పనుల్లో కీలక ముందడుగు
జనరల్

ఎస్‌ఎల్‌బీసీ పనుల్లో కీలక ముందడుగు

విజయవాడలో ఫుడ్‌ సేఫ్టీ తనిఖీలు ముమ్మరం..
జనరల్

విజయవాడలో ఫుడ్‌ సేఫ్టీ తనిఖీలు ముమ్మరం..

సీబీఐ పగ్గాల నుంచి రాజకీయాల్లోకి.. నాగేశ్వరరావు కీలక నిర్ణయం
జనరల్

సీబీఐ పగ్గాల నుంచి రాజకీయాల్లోకి.. నాగేశ్వరరావు కీలక నిర్ణయం

ఆర్కిటిక్‌లో రష్యా, చైనా దూకుడుకు అమెరికా కౌంటర్..
జనరల్

ఆర్కిటిక్‌లో రష్యా, చైనా దూకుడుకు అమెరికా కౌంటర్..

సురేఖా వాణికి అవకాశాలు తగ్గాయి.. కుటుంబ పరిస్థితిపై సుప్రీత కీలక వ్యాఖ్యలు
సినిమాలు

సురేఖా వాణికి అవకాశాలు తగ్గాయి.. కుటుంబ పరిస్థితిపై సుప్రీత కీలక వ్యాఖ్యలు

ఏఐ డీప్‌ఫేక్‌లపై మంచు విష్ణు ఆగ్రహం..
సినిమాలు

ఏఐ డీప్‌ఫేక్‌లపై మంచు విష్ణు ఆగ్రహం..

ఫ్లైదుబాయ్ విమానాన్ని టెల్ అవీవ్‌లో కూల్చేందుకు కోపైలట్ కుట్ర?
జనరల్

ఫ్లైదుబాయ్ విమానాన్ని టెల్ అవీవ్‌లో కూల్చేందుకు కోపైలట్ కుట్ర?

ఉద్యోగ హోదా కంటే ఆదాయ భద్రత ముఖ్యం.. కీలక సూచనలు
బిజినెస్

ఉద్యోగ హోదా కంటే ఆదాయ భద్రత ముఖ్యం.. కీలక సూచనలు