
సినిమాలు

సుప్రీంకోర్టు విచారణల వీడియోలు, ఆడియోలను సోషల్ మీడియా మరియు ఇతర డిజిటల్ వేదికల్లో అనుమతి లేకుండా వినియోగించడంపై అత్యున్నత న్యాయస్థానం కఠిన ఆంక్షలు విధించింది. ముందస్తు అనుమతి లేకుండా కోర్టు రికార్డింగ్‌లను పోస్టు చేయడం, ప్రసారం చేయడం, నిల్వ చేయడం నిషేధమని స్పష్టం చేసింది. కోర్టు ప్రక్రియల గౌరవం, న్యాయవ్యవస్థ సమగ్రతను కాపాడేందుకు ఈ మార్గదర్శకాలను జారీ చేసింది.
అదేవిధంగా కోర్టు వీడియోలను ఎడిట్ చేయడం, మానిటైజ్ చేయడం, డౌన్లోడ్ చేయడం లేదా మళ్లీ పోస్టు చేయడం కూడా నేరంగా పరిగణిస్తామని సుప్రీంకోర్టు హెచ్చరించింది. అయితే కేసులపై వార్తలు ప్రచురించే మీడియా సంస్థలకు ఉపశమనం కల్పిస్తూ, న్యాయపరమైన రిపోర్టింగ్‌పై ఎలాంటి ఆంక్షలు విధించలేదని స్పష్టం చేసింది. దీంతో కోర్టు విచారణలపై వార్తా కథనాల ప్రచురణ యథావిధిగా కొనసాగనుంది.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!