
జనరల్

మూడు హత్యల కేసులో యావజ్జీవ శిక్ష అనుభవిస్తున్న ఏడిద ఆనందకుమార్ దాఖలు చేసిన క్షమాభిక్ష పిటిషన్‌ను సుప్రీంకోర్టు తిరస్కరించింది. తూర్పుగోదావరి జిల్లా కోరుకొండ గ్రామానికి చెందిన అతను 2015 డిసెంబర్ 24న జరిగిన హత్యలపై కింది కోర్టులు విధించిన శిక్షను రద్దు చేయాలని కోరాడు.
వ్యక్తిగత కక్షతో ఒకే రోజులో మూడు హత్యలు చేసినట్లు కేసు వివరాల్లో పేర్కొన్నారు. జస్టిస్ సతీష్‌చంద్ర శర్మ, జస్టిస్ సంజీవ్ సచ్దేవ ధర్మాసనం పిటిషన్‌ను కొట్టేసింది. అతనికి మానసిక వ్యాధి ఉందన్న వాదనను కూడా న్యాయస్థానం తోసిపుచ్చింది. శిక్షను మార్చడానికి సరైన ఆధారాలు లేవని కోర్టు స్పష్టం చేసింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!