30, అక్టోబర్ 2026, శుక్రవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

కాలుష్యరహిత దీపావళి ప్రచారానికి విరాట్ కోహ్లీ సేవలు తీసుకోండి.. సుప్రీంకోర్టు కీలక సూచన!

Writer: Chandrika 10:56 AM, 30 అక్టోబర్, 2026
కాలుష్యరహిత దీపావళి ప్రచారానికి విరాట్ కోహ్లీ సేవలు తీసుకోండి.. సుప్రీంకోర్టు కీలక సూచన!

దీపావళి పండుగను బాణసంచా లేకుండా పర్యావరణహితంగా జరుపుకునేలా ప్రజల్లో అవగాహన పెంచాలని సుప్రీంకోర్టు సూచించింది. ఇందుకోసం టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీతో పాటు ప్రముఖ క్రీడాకారులు, సినీ ప్రముఖుల సేవలను వినియోగించుకోవాలని అభిప్రాయపడింది. బాణసంచా కాలుష్యంపై దాఖలైన పిటిషన్లను జస్టిస్ ఎం.ఎం. సుందరేశ్, జస్టిస్ ప్రసన్న బి. వరలే నేతృత్వంలోని ధర్మాసనం విచారించింది. ప్రతి ఏడాది కాలుష్య నియంత్రణకు ఆదేశాలు జారీ చేస్తున్నప్పటికీ ఉల్లంఘనలు కొనసాగుతున్నాయని, ఆశించిన ఫలితాలు రావడం లేదని వ్యాఖ్యానించింది. ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ప్రముఖ క్రీడాకారులను ఎందుకు ఉపయోగించుకోవడం లేదని జస్టిస్ వరలే ప్రశ్నించగా, ఢిల్లీలో విరాట్ కోహ్లీ వంటి క్రికెటర్లతో ప్రత్యేక ప్రచార కార్యక్రమాలు నిర్వహించాలని జస్టిస్ సుందరేశ్ సూచించారు. దీపావళి అంటే దీపాల పండుగ అని, బాణసంచా లేకుండానే పండుగను ఆనందంగా జరుపుకోవాలనే సందేశాన్ని ప్రముఖుల ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్లాలని పేర్కొన్నారు.

మరోవైపు బాణసంచా కాల్చడం వల్ల విషపూరిత వాయువులతో పాటు పీఎం2.5 కాలుష్య కణాలు విడుదలవుతాయని కోర్టు మిత్రురాలు అపరాజిత సింగ్ వివరించారు. ఇవి రక్తప్రవాహంలోకి చేరి శరీరంలోని కీలక అవయవాలపై ప్రభావం చూపుతాయని తెలిపారు. గ్రీన్ క్రాకర్స్ సైతం పూర్తిగా కాలుష్యరహితమైనవి కావని స్పష్టం చేశారు. బాణసంచా తయారీపై సంపూర్ణ నిషేధం విధించాలని పిటిషనర్లు కోరగా, తయారీదారుల తరఫు న్యాయవాది ఆ ప్రతిపాదనను వ్యతిరేకించారు. నిషేధం విధిస్తే అక్రమ విక్రయాలు, స్మగ్లింగ్ పెరిగే ప్రమాదం ఉందని వాదించారు. ఇదిలా ఉండగా, ఢిల్లీలోని 39 కాలుష్య పర్యవేక్షణ కేంద్రాల్లో కేవలం తొమ్మిది మాత్రమే పనిచేస్తుండటంపై సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. కాలుష్య నియంత్రణకు తీసుకుంటున్న చర్యల వివరాలను సమర్పించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
తుపాను ప్రభావిత ప్రాంతాల్లో విద్యుత్ పునరుద్ధరణకు తమిళనాడు సాయం కోరిన ఏపీ

తుపాను ప్రభావిత ప్రాంతాల్లో విద్యుత్ పునరుద్ధరణకు తమిళనాడు సాయం కోరిన ఏపీ

వరంగల్ మార్కెట్‌లో మక్కల ధర రికార్డు..

వరంగల్ మార్కెట్‌లో మక్కల ధర రికార్డు..

తెలంగాణలో బియ్యం ధరలకు రెక్కలు..

తెలంగాణలో బియ్యం ధరలకు రెక్కలు..

విపత్తు బాధితులకు అండగా ప్రభుత్వాలు నిలవాలి: రాహుల్ గాంధీ

విపత్తు బాధితులకు అండగా ప్రభుత్వాలు నిలవాలి: రాహుల్ గాంధీ

హైదరాబాద్ ప్రయాణికులకు ఆర్టీసీ గుడ్‌న్యూస్..

హైదరాబాద్ ప్రయాణికులకు ఆర్టీసీ గుడ్‌న్యూస్..

నేడు ఏపీకి కేంద్ర బృందం.. అర్నబ్ తుఫాన్ నష్టంపై క్షేత్రస్థాయి పరిశీలన

నేడు ఏపీకి కేంద్ర బృందం.. అర్నబ్ తుఫాన్ నష్టంపై క్షేత్రస్థాయి పరిశీలన

ట్యాగ్లు
సుప్రీంకోర్టువిరాట్ కోహ్లీపర్యావరణహిత దీపావళిగ్రీన్ దీపావళిబాణసంచా కాలుష్యంఢిల్లీ కాలుష్యంవాయు కాలుష్యంపీఎం2.5కాలుష్య నియంత్రణదీపావళి వేడుకలుభారత వార్తలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఆదర్శ కుటుంబం రివ్యూ:వెంకటేశ్, త్రివిక్రమ్ కాంబినేషన్‌లో ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ఎలా ఉందంటే?
రివ్యూలు

ఆదర్శ కుటుంబం రివ్యూ:వెంకటేశ్, త్రివిక్రమ్ కాంబినేషన్‌లో ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ఎలా ఉందంటే?

ఆర్నబ్ తుఫాన్ వేళ ఏపీకి తమిళనాడు అండ.. కీలక సాయం
రాజకీయాలు

ఆర్నబ్ తుఫాన్ వేళ ఏపీకి తమిళనాడు అండ.. కీలక సాయం

తుపాను ప్రభావిత ప్రాంతాల్లో విద్యుత్ పునరుద్ధరణకు తమిళనాడు సాయం కోరిన ఏపీ
జనరల్

తుపాను ప్రభావిత ప్రాంతాల్లో విద్యుత్ పునరుద్ధరణకు తమిళనాడు సాయం కోరిన ఏపీ

వరంగల్ మార్కెట్‌లో మక్కల ధర రికార్డు..
జనరల్

వరంగల్ మార్కెట్‌లో మక్కల ధర రికార్డు..

తెలంగాణలో బియ్యం ధరలకు రెక్కలు..
జనరల్

తెలంగాణలో బియ్యం ధరలకు రెక్కలు..

విపత్తు బాధితులకు అండగా ప్రభుత్వాలు నిలవాలి: రాహుల్ గాంధీ
జనరల్

విపత్తు బాధితులకు అండగా ప్రభుత్వాలు నిలవాలి: రాహుల్ గాంధీ

నేటి బంగారం, వెండి ధరలు ఇవే...ఎంత తగ్గాయంటే?
బిజినెస్

నేటి బంగారం, వెండి ధరలు ఇవే...ఎంత తగ్గాయంటే?

కాలుష్యరహిత దీపావళి ప్రచారానికి విరాట్ కోహ్లీ సేవలు తీసుకోండి.. సుప్రీంకోర్టు కీలక సూచన!
జనరల్

కాలుష్యరహిత దీపావళి ప్రచారానికి విరాట్ కోహ్లీ సేవలు తీసుకోండి.. సుప్రీంకోర్టు కీలక సూచన!

హైదరాబాద్ ప్రయాణికులకు ఆర్టీసీ గుడ్‌న్యూస్..
జనరల్

హైదరాబాద్ ప్రయాణికులకు ఆర్టీసీ గుడ్‌న్యూస్..

నేడు ఏపీకి కేంద్ర బృందం.. అర్నబ్ తుఫాన్ నష్టంపై క్షేత్రస్థాయి పరిశీలన
జనరల్

నేడు ఏపీకి కేంద్ర బృందం.. అర్నబ్ తుఫాన్ నష్టంపై క్షేత్రస్థాయి పరిశీలన

ఆల్ఫాబెట్‌కు భారీ షాక్.. ఒక్కరోజే 500 బిలియన్ డాలర్లు ఆవిరి!
బిజినెస్

ఆల్ఫాబెట్‌కు భారీ షాక్.. ఒక్కరోజే 500 బిలియన్ డాలర్లు ఆవిరి!

హాలీవుడ్ దిగ్గజ నటుడు సర్ పాట్రిక్ స్టువర్ట్ కన్నుమూత
జనరల్

హాలీవుడ్ దిగ్గజ నటుడు సర్ పాట్రిక్ స్టువర్ట్ కన్నుమూత

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!