
జనరల్

వరంగల్ (ఏనుమాముల) వ్యవసాయ మార్కెట్‌లో మొక్కజొన్న ధర మరోసారి పెరిగి సరికొత్త రికార్డు సృష్టించింది. గురువారం మార్కెట్‌లో క్వింటాల్ మక్కలు రూ.3,255 పలికాయి. గతంలో నమోదైన ధరను అధిగమించడంతో రైతుల్లో హర్షం వ్యక్తమవుతోంది. ధర పెరుగుదల మొక్కజొన్న సాగు చేసిన రైతులకు కొంత ఊరటనిస్తోంది.
మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి మండలం పెద్దముప్పారం గ్రామానికి చెందిన రైతు ఉడుగుల నాగబాబు 66 బస్తాల మొక్కజొన్నలను విక్రయించేందుకు మార్కెట్‌కు తీసుకొచ్చారు. విజయ ట్రేడర్స్ కమిషన్ ఏజెంట్ ద్వారా ప్రేమ్ ఎంటర్‌ప్రైజెస్ నిర్వాహకులు క్వింటాల్‌కు రూ.3,255 చొప్పున కొనుగోలు చేశారు. మొక్కజొన్న దిగుబడి తగ్గడంతో పాటు మార్కెట్లో డిమాండ్ పెరగడం వల్లే ధర అధికంగా పలుకుతోందని చెబుతున్నారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!