
క్రీడలు

నిందితుడిని అదుపులోకి తీసుకున్న సమయం నుంచే 24 గంటల్లోగా మేజిస్ట్రేట్ ఎదుట హాజరుపరచాలని సుప్రీంకోర్టు కీలక స్పష్టత ఇచ్చింది. కేవలం అధికారికంగా అరెస్టు చేసిన సమయం నుంచే ఈ గడువును లెక్కించకూడదని వెల్లడించింది. పోలీసుల అదుపులోకి తీసుకున్న క్షణం నుంచే వ్యక్తి స్వేచ్ఛకు భంగం కలుగుతుందని, నిర్బంధం, అరెస్టు రెండూ వ్యక్తి వ్యక్తిగత స్వేచ్ఛను ఒకే విధంగా ప్రభావితం చేస్తాయని న్యాయస్థానం పేర్కొంది.
ఈ నేపథ్యంలో పోలీసులు ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకున్న వెంటనే 24 గంటల గడువు ప్రారంభమవుతుందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. నిర్బంధం, అధికారిక అరెస్టు వేర్వేరు చట్టపరమైన స్థితులుగా పరిగణిస్తూ ఈ రెండింటి మధ్య తేడా చూపిన కొన్ని హైకోర్టుల వైఖరిని కూడా అత్యున్నత న్యాయస్థానం తప్పుబట్టింది. వ్యక్తిగత స్వేచ్ఛ, నిందితుల హక్కుల పరిరక్షణకు ఈ స్పష్టత కీలకంగా మారనుంది.



కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!