5, నవంబర్ 2026, గురువారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానంనిబంధనలు & షరతులు
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంనవలలురచయితలుడ్రాయింగ్స్పోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానంనిబంధనలు & షరతులు

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

అయ్యప్ప సొసైటీలో అక్రమ నిర్మాణాలపై కల్వకుంట్ల కవిత తీవ్ర ఆరోపణలు

Writer: Nithish 12:44 PM, 5 నవంబర్, 2026
అయ్యప్ప సొసైటీలో అక్రమ నిర్మాణాలపై కల్వకుంట్ల కవిత తీవ్ర ఆరోపణలు

హైదరాబాద్‌లోని అయ్యప్ప సొసైటీ, ఖానామెట్ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున అక్రమ నిర్మాణాలు జరుగుతున్నాయని తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అక్కడ 500 నుంచి 700 వరకు అక్రమ భవనాలు నిర్మించారని, ప్రస్తుతం మరో 80 భవనాల వరకు నిర్మాణంలో ఉన్నాయని పేర్కొన్నారు. నోటరీ ఆధారంగా రిజిస్ట్రేషన్లు చేస్తూ పది నుంచి పన్నెండు అంతస్తుల వరకు అనుమతులు ఇస్తున్నారని ఆరోపించారు. రెండు భవనాల మధ్య కనీస దూరం కూడా లేకుండా నిర్మాణాలు చేపడుతున్నారని, సెల్లార్లలో కిచెన్లు నిర్వహిస్తూ కాలేజీలు, పీజీ హాస్టళ్లు కొనసాగిస్తున్నారని తెలిపారు. దీంతో అగ్ని ప్రమాదాలు జరిగితే భారీ ప్రాణ, ఆస్తి నష్టం సంభవించే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ప్రాంతంలో భూగర్భ జలాలు లేని కారణంగా నిర్మాణాలు చేపట్టవద్దని హైకోర్టు ఆదేశాలు ఉన్నప్పటికీ వాటిని పట్టించుకోవడం లేదని ఆరోపించారు. ముఖ్యమంత్రి, ఆయన కుటుంబ సభ్యుల అండతోనే అక్రమ నిర్మాణాలకు అనుమతులు లభిస్తున్నాయని విమర్శించారు. సైబరాబాద్ మున్సిపల్ అధికారుల తీరుపైనా ప్రశ్నలు లేవనెత్తారు. ఖానామెట్‌లో సమగ్ర సర్వే నిర్వహించి, అనుమతులు లేని భవనాలు, ఫైర్ సేఫ్టీ నిబంధనలు పాటించని నిర్మాణాలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

ప్రభుత్వానికి నెల రోజుల గడువు ఇస్తున్నామని, ఈలోగా అక్రమ భవనాలపై చర్యలు తీసుకోకపోతే తమ పార్టీ తరఫున వెళ్లి వాటికి రెడ్ మార్క్ వేస్తామని కవిత హెచ్చరించారు. అయ్యప్ప సొసైటీలో భూములు కొనుగోలు చేసి ప్రజలు ఇబ్బందులు పడవద్దని సూచించారు. నోటరీ రిజిస్ట్రేషన్లపై రిజిస్ట్రేషన్ల శాఖ విచారణ చేపట్టాలని, నిజమైన భూ యజమానులకు అన్యాయం జరగకుండా చూడాలని కోరారు. రాష్ట్రంలో ఆర్టీఐ వ్యవస్థ నిర్వీర్యమైందని, వేలాది దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయని విమర్శించారు. మరోవైపు, రాష్ట్రంలో కరువు పరిస్థితులు నెలకొన్నప్పటికీ కేంద్ర ప్రభుత్వం ఎలాంటి సహాయం అందించలేదని, హైదరాబాద్‌లో రాజకీయాలకే ప్రాధాన్యం ఇచ్చిందని కేంద్ర హోంమంత్రి అమిత్ షాపై విమర్శలు చేశారు. రాష్ట్రంలో సాగునీరు, విద్యుత్ కొరత సమస్యలను పరిష్కరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో మహిళా ఓటర్లు పెద్ద సంఖ్యలో నమోదు చేసుకుని తమ పార్టీకి మద్దతు ఇవ్వాలని పిలుపునిచ్చారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
కొత్తపట్నం బీచ్‌కు కొట్టుకొచ్చిన బోటు.. అందులో నాలుగు మృతదేహాలు!

కొత్తపట్నం బీచ్‌కు కొట్టుకొచ్చిన బోటు.. అందులో నాలుగు మృతదేహాలు!

కొత్త ఓటర్లకు ఊరట.. ఓటరు నమోదు నిబంధనల్లో ఈసీ కీలక మార్పులు

కొత్త ఓటర్లకు ఊరట.. ఓటరు నమోదు నిబంధనల్లో ఈసీ కీలక మార్పులు

తిరుమల లడ్డూ కల్తీ కేసుపై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం..

తిరుమల లడ్డూ కల్తీ కేసుపై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం..

అరెస్టు, నిర్బంధంపై సుప్రీంకోర్టు కీలక తీర్పు

అరెస్టు, నిర్బంధంపై సుప్రీంకోర్టు కీలక తీర్పు

తెలంగాణపై ఎల్‌నినో ప్రభావం.. ఒంటిపూట బడులు, వర్క్ ఫ్రమ్ హోమ్‌పై చర్చ
ట్యాగ్లు
కల్వకుంట్ల కవితతెలంగాణ రక్షణ సేనఅయ్యప్ప సొసైటీఖానామెట్ అక్రమ నిర్మాణాలుహైదరాబాద్ వార్తలుతెలంగాణ రాజకీయాలుకాంగ్రెస్ ప్రభుత్వంహైకోర్టు ఆదేశాలుఅక్రమ భవనాలుగ్రేటర్ హైదరాబాద్

తెలంగాణపై ఎల్‌నినో ప్రభావం.. ఒంటిపూట బడులు, వర్క్ ఫ్రమ్ హోమ్‌పై చర్చ

ఇరాన్‌కు సహకారం.. భారత వ్యాపారవేత్త, ఆయన భార్యపై అమెరికా ఆంక్షలు

ఇరాన్‌కు సహకారం.. భారత వ్యాపారవేత్త, ఆయన భార్యపై అమెరికా ఆంక్షలు

AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
క్రికెట్‌లోనే కాదు.. బ్రాండ్ ప్రపంచంలోనూ కింగ్ కోహ్లీ
క్రీడలు

క్రికెట్‌లోనే కాదు.. బ్రాండ్ ప్రపంచంలోనూ కింగ్ కోహ్లీ

అమ్మవారిని దర్శించుకున్న నయనతార.. మహిళలకు చీరల పంపిణీ
సినిమాలు

అమ్మవారిని దర్శించుకున్న నయనతార.. మహిళలకు చీరల పంపిణీ

పంజాబ్ డ్రగ్స్ సమస్యపై అమిత్ షాకు రాహుల్ గాంధీ సవాల్
రాజకీయాలు

పంజాబ్ డ్రగ్స్ సమస్యపై అమిత్ షాకు రాహుల్ గాంధీ సవాల్

కొత్తపట్నం బీచ్‌కు కొట్టుకొచ్చిన బోటు.. అందులో నాలుగు మృతదేహాలు!
జనరల్

కొత్తపట్నం బీచ్‌కు కొట్టుకొచ్చిన బోటు.. అందులో నాలుగు మృతదేహాలు!

కొత్త ఓటర్లకు ఊరట.. ఓటరు నమోదు నిబంధనల్లో ఈసీ కీలక మార్పులు
జనరల్

కొత్త ఓటర్లకు ఊరట.. ఓటరు నమోదు నిబంధనల్లో ఈసీ కీలక మార్పులు

రామాయణం ఇండియన్ సినిమాకు గ్లోబల్ టర్నింగ్ పాయింట్ అవుతుంది.. విజయ్ దేవరకొండ
సినిమాలు

రామాయణం ఇండియన్ సినిమాకు గ్లోబల్ టర్నింగ్ పాయింట్ అవుతుంది.. విజయ్ దేవరకొండ

ప్రాదేశిక ఎన్నికల్లో డబ్బుల పంపిణీ.. మార్కాపురం, ప్రకాశంలో ఓటుకు నోటు!
రాజకీయాలు

ప్రాదేశిక ఎన్నికల్లో డబ్బుల పంపిణీ.. మార్కాపురం, ప్రకాశంలో ఓటుకు నోటు!

రిగ్గింగ్ ఆరోపణలపై పరిటాల సునీత ఘాటు స్పందన
రాజకీయాలు

రిగ్గింగ్ ఆరోపణలపై పరిటాల సునీత ఘాటు స్పందన

అయ్యప్ప సొసైటీలో అక్రమ నిర్మాణాలపై కల్వకుంట్ల కవిత తీవ్ర ఆరోపణలు
జనరల్

అయ్యప్ప సొసైటీలో అక్రమ నిర్మాణాలపై కల్వకుంట్ల కవిత తీవ్ర ఆరోపణలు

అనవసర గొడవలకు దూరంగా ఉండండి..కార్యకర్తలకు జేసీ ప్రభాకర్‌రెడ్డి సూచన
రాజకీయాలు

అనవసర గొడవలకు దూరంగా ఉండండి..కార్యకర్తలకు జేసీ ప్రభాకర్‌రెడ్డి సూచన

తిరుమల లడ్డూ కల్తీ కేసుపై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం..
జనరల్

తిరుమల లడ్డూ కల్తీ కేసుపై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం..

కడప రాజకీయాల్లో టాపిక్‌గా మారిన వైఎస్సార్‌సీపీ అభ్యర్థి
రాజకీయాలు

కడప రాజకీయాల్లో టాపిక్‌గా మారిన వైఎస్సార్‌సీపీ అభ్యర్థి

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!