5, నవంబర్ 2026, గురువారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానంనిబంధనలు & షరతులు
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంనవలలురచయితలుడ్రాయింగ్స్పోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానంనిబంధనలు & షరతులు

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

క్రికెట్‌లోనే కాదు.. బ్రాండ్ ప్రపంచంలోనూ కింగ్ కోహ్లీ

Writer: Nithish 12:57 PM, 5 నవంబర్, 2026
క్రికెట్‌లోనే కాదు.. బ్రాండ్ ప్రపంచంలోనూ కింగ్ కోహ్లీ

టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ తన ఆటతోనే కాకుండా బ్రాండ్ ప్రపంచంలోనూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు. నవంబర్ 5న తన పుట్టినరోజు సందర్భంగా మైదానం బయట అతడు నిర్మించుకున్న బ్రాండ్ సామ్రాజ్యం మరోసారి చర్చనీయాంశంగా మారింది. 2008లో అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెట్టిన కోహ్లీ.. ఆ తర్వాత ఫిట్‌నెస్, ఫ్యాషన్, లైఫ్‌స్టైల్, వ్యాపార రంగాల్లోనూ తనదైన ముద్ర వేశాడు. ఆగస్టు 2026లో విడుదలైన క్రోల్ ఇండియా సెలబ్రిటీ బ్రాండ్ వాల్యుయేషన్ 2025 నివేదిక ప్రకారం, కోహ్లీ బ్రాండ్ విలువ 158.4 మిలియన్ డాలర్లు (సుమారు రూ.1,320 కోట్లు)గా నమోదైంది. ఈ జాబితాలో భారత్‌లో మూడో స్థానంలో నిలిచిన అతడు, క్రీడాకారుల్లో అత్యధిక బ్రాండ్ విలువ కలిగిన సెలబ్రిటీగా కొనసాగుతున్నాడు. షారుఖ్ ఖాన్, రణ్‌వీర్ సింగ్ వరుసగా మొదటి రెండు స్థానాల్లో నిలిచారు. గత ఏడాదితో పోలిస్తే కోహ్లీ బ్రాండ్ విలువ తగ్గినప్పటికీ, ప్రకటనల రంగంలో అతడి ప్రభావం మాత్రం కొనసాగుతోంది.

ప్రకటనల ప్రపంచంలోనూ కోహ్లీ ప్రయాణం ఎంతో ఆసక్తికరంగా సాగింది. 2010లో జెనీలియా డిసౌజాతో కలిసి ఫాస్ట్రాక్ ప్రకటనలో కనిపించి యూత్‌ను ఆకట్టుకున్నాడు. 2013లో నెస్లే మంచ్ యాడ్‌లో తన కామెడీ టైమింగ్‌తో అలరించాడు. అదే ఏడాది క్లియర్ షాంపూ ప్రకటనలో అనుష్క శర్మతో కలిసి నటించడం వారి పరిచయానికి ప్రత్యేక గుర్తుగా నిలిచింది. ఆ పరిచయం ప్రేమగా మారి 2017లో వీరిద్దరూ వివాహం చేసుకున్నారు. అనంతరం మాన్యావర్-మోహే, ప్యూమా, one8, టూ యమ్, మింత్రా, లివ్‌స్పేస్, ఏషియన్ పెయింట్స్ వంటి ప్రముఖ బ్రాండ్ల ప్రచారాల్లో భాగమయ్యాడు. అనుష్కతో కలిసి పలు ప్రకటనల్లోనూ సందడి చేశాడు. విజిట్ దుబాయ్ ప్రచారంతో పర్యాటక రంగాన్ని ప్రమోట్ చేసిన కోహ్లీ.. 2026లో జాన్ వాకర్ 'కీప్ వాకింగ్' ప్రచారంలోనూ కనిపించాడు. ఇలా క్రికెట్‌తో పాటు వ్యాపారవేత్తగా, బ్రాండ్ అంబాసిడర్‌గా విభిన్న రంగాల్లో తన ప్రభావాన్ని చాటుకుంటున్నాడు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
కష్టకాలంలో కోహ్లీ మాటలు ఎంతో స్ఫూర్తినిచ్చాయి: పీవీ సింధు

కష్టకాలంలో కోహ్లీ మాటలు ఎంతో స్ఫూర్తినిచ్చాయి: పీవీ సింధు

న్యూజిలాండ్‌తో మ్యాచ్‌లో రో-కో మెరుపులు..

న్యూజిలాండ్‌తో మ్యాచ్‌లో రో-కో మెరుపులు..

ఆసియా ఛాంపియన్స్‌ ట్రోఫీ ఫైనల్‌కు దూసుకెళ్లిన టీమ్‌ఇండియా

ఆసియా ఛాంపియన్స్‌ ట్రోఫీ ఫైనల్‌కు దూసుకెళ్లిన టీమ్‌ఇండియా

యూత్‌ ఒలింపిక్స్‌లో చరిత్ర సృష్టించిన తన్వి పాత్రి..

యూత్‌ ఒలింపిక్స్‌లో చరిత్ర సృష్టించిన తన్వి పాత్రి..

వదోదర, ముంబయి వేదికలుగా మహిళల ప్రీమియర్‌ లీగ్‌
ట్యాగ్లు
విరాట్ కోహ్లీకోహ్లీ పుట్టినరోజువిరాట్ కోహ్లీ బ్రాండ్ వ్యాల్యూకోహ్లీ బ్రాండ్ సామ్రాజ్యంకోహ్లీ ప్రకటనలుఅనుష్క శర్మక్రికెట్ వార్తలుసెలబ్రిటీ బ్రాండ్ వాల్యూకోహ్లీ బిజినెస్టీమిండియా

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!

వదోదర, ముంబయి వేదికలుగా మహిళల ప్రీమియర్‌ లీగ్‌

ఐఎస్‌ఎస్‌ఎఫ్‌ ప్రపంచ ఛాంపియన్‌షిప్స్‌లో భారత్‌కు నిరాశ..

ఐఎస్‌ఎస్‌ఎఫ్‌ ప్రపంచ ఛాంపియన్‌షిప్స్‌లో భారత్‌కు నిరాశ..

AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
క్రికెట్‌లోనే కాదు.. బ్రాండ్ ప్రపంచంలోనూ కింగ్ కోహ్లీ
క్రీడలు

క్రికెట్‌లోనే కాదు.. బ్రాండ్ ప్రపంచంలోనూ కింగ్ కోహ్లీ

అమ్మవారిని దర్శించుకున్న నయనతార.. మహిళలకు చీరల పంపిణీ
సినిమాలు

అమ్మవారిని దర్శించుకున్న నయనతార.. మహిళలకు చీరల పంపిణీ

పంజాబ్ డ్రగ్స్ సమస్యపై అమిత్ షాకు రాహుల్ గాంధీ సవాల్
రాజకీయాలు

పంజాబ్ డ్రగ్స్ సమస్యపై అమిత్ షాకు రాహుల్ గాంధీ సవాల్

కొత్తపట్నం బీచ్‌కు కొట్టుకొచ్చిన బోటు.. అందులో నాలుగు మృతదేహాలు!
జనరల్

కొత్తపట్నం బీచ్‌కు కొట్టుకొచ్చిన బోటు.. అందులో నాలుగు మృతదేహాలు!

కొత్త ఓటర్లకు ఊరట.. ఓటరు నమోదు నిబంధనల్లో ఈసీ కీలక మార్పులు
జనరల్

కొత్త ఓటర్లకు ఊరట.. ఓటరు నమోదు నిబంధనల్లో ఈసీ కీలక మార్పులు

రామాయణం ఇండియన్ సినిమాకు గ్లోబల్ టర్నింగ్ పాయింట్ అవుతుంది.. విజయ్ దేవరకొండ
సినిమాలు

రామాయణం ఇండియన్ సినిమాకు గ్లోబల్ టర్నింగ్ పాయింట్ అవుతుంది.. విజయ్ దేవరకొండ

ప్రాదేశిక ఎన్నికల్లో డబ్బుల పంపిణీ.. మార్కాపురం, ప్రకాశంలో ఓటుకు నోటు!
రాజకీయాలు

ప్రాదేశిక ఎన్నికల్లో డబ్బుల పంపిణీ.. మార్కాపురం, ప్రకాశంలో ఓటుకు నోటు!

రిగ్గింగ్ ఆరోపణలపై పరిటాల సునీత ఘాటు స్పందన
రాజకీయాలు

రిగ్గింగ్ ఆరోపణలపై పరిటాల సునీత ఘాటు స్పందన

అయ్యప్ప సొసైటీలో అక్రమ నిర్మాణాలపై కల్వకుంట్ల కవిత తీవ్ర ఆరోపణలు
జనరల్

అయ్యప్ప సొసైటీలో అక్రమ నిర్మాణాలపై కల్వకుంట్ల కవిత తీవ్ర ఆరోపణలు

అనవసర గొడవలకు దూరంగా ఉండండి..కార్యకర్తలకు జేసీ ప్రభాకర్‌రెడ్డి సూచన
రాజకీయాలు

అనవసర గొడవలకు దూరంగా ఉండండి..కార్యకర్తలకు జేసీ ప్రభాకర్‌రెడ్డి సూచన

తిరుమల లడ్డూ కల్తీ కేసుపై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం..
జనరల్

తిరుమల లడ్డూ కల్తీ కేసుపై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం..

కడప రాజకీయాల్లో టాపిక్‌గా మారిన వైఎస్సార్‌సీపీ అభ్యర్థి
రాజకీయాలు

కడప రాజకీయాల్లో టాపిక్‌గా మారిన వైఎస్సార్‌సీపీ అభ్యర్థి

ప్రత్యర్థులనే తన వర్గంలోకి చేర్చుకున్న పెద్దిరెడ్డి.. పీలేరులో రాజకీయ వ్యూహాలివే!
రాజకీయాలు

ప్రత్యర్థులనే తన వర్గంలోకి చేర్చుకున్న పెద్దిరెడ్డి.. పీలేరులో రాజకీయ వ్యూహాలివే!

అరెస్టు, నిర్బంధంపై సుప్రీంకోర్టు కీలక తీర్పు
జనరల్

అరెస్టు, నిర్బంధంపై సుప్రీంకోర్టు కీలక తీర్పు

కడప పరిషత్‌ ఎన్నికల్లో కూటమి జోరు.. పట్టు నిలుపుకునేందుకు వైఎస్సార్‌సీపీ పోరాటం
రాజకీయాలు

కడప పరిషత్‌ ఎన్నికల్లో కూటమి జోరు.. పట్టు నిలుపుకునేందుకు వైఎస్సార్‌సీపీ పోరాటం