
జనరల్

ఇటీవల కాలంలో సినీ సెలబ్రిటీల ఫోటోలు, వాయిస్‌లు, వీడియోలను ఏఐ టెక్నాలజీ సహాయంతో మార్చి నకిలీ డీప్‌ఫేక్‌లు సృష్టించే ఘటనలు పెరుగుతున్నాయి. దీంతో పలువురు నటీనటులు కోర్టును ఆశ్రయించి చట్టపరమైన రక్షణ కోరుతున్నారు. తాజాగా సీనియర్ నటి టబు కూడా తన పేరు, ఫోటోలు, వాయిస్‌ను అనుమతి లేకుండా వినియోగించకుండా రక్షణ కల్పించాలని ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు.
తన పేరుతో నకిలీ సోషల్ మీడియా ఖాతాలు సృష్టించడం, ఏఐ ద్వారా డీప్‌ఫేక్‌లు తయారు చేయడం, వ్యాపార ప్రకటనల్లో అనుమతి లేకుండా తన గుర్తింపును వినియోగించడాన్ని టబు తీవ్రంగా అభ్యంతరం తెలిపారు. అయితే ఆమె తరఫున సమర్పించిన పత్రాల్లో కొన్ని లోపాలు ఉన్నట్లు గుర్తించిన జస్టిస్ జ్యోతి సింగ్, పూర్తి వివరాలతో సవరించిన పత్రాలను దాఖలు చేయాలని ఆదేశించారు. అనంతరం కేసు విచారణను ఆగస్టు 6కు వాయిదా వేశారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!