

తెలంగాణ విద్యుత్ ఉత్పత్తి సంస్థ (టీజీజెన్కో)కు చెందిన తాడిచెర్ల-I ఓపెన్‌కాస్ట్ బొగ్గు గని మరో ప్రతిష్ఠాత్మక గుర్తింపును సొంతం చేసుకుంది. 2024-25 ఆర్థిక సంవత్సరానికి గాను కేంద్ర బొగ్గు మంత్రిత్వ శాఖ ప్రకటించిన 5-స్టార్ రేటింగ్ అవార్డును దక్కించుకుంది. గనుల నిర్వహణ, భద్రతా ప్రమాణాల అమలు, పర్యావరణ పరిరక్షణ, సుస్థిరమైన బొగ్గు తవ్వక విధానాల్లో కనబరిచిన అత్యుత్తమ పనితీరుకు ఈ పురస్కారం లభించింది. గతంలో 2020-21, 2023-24 ఆర్థిక సంవత్సరాల్లోనూ ఈ గనికి 5-స్టార్ రేటింగ్ అవార్డులు దక్కాయి. తాజాగా మరోసారి ఈ గుర్తింపు లభించడంతో సంస్థ విజయాల పరంపర కొనసాగుతోంది.
2024-25 సంవత్సరానికి సంబంధించిన 5-స్టార్ రేటింగ్ అవార్డుల ప్రదానోత్సవం నవంబర్ 2న ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌పూర్ మేఫెయిర్ లేక్ రిసార్ట్‌లో నిర్వహించారు. కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి, సహాయ మంత్రి సతీష్ చంద్ర దూబే చేతుల మీదుగా టీజీజెన్కో ప్రతినిధులు ఈ అవార్డును అందుకున్నారు. సంస్థ తరఫున డైరెక్టర్ (బొగ్గు, లాజిస్టిక్స్), తాడిచెర్ల-I బొగ్గు గని యజమాని బి. నాగ్య (ఐఆర్‌టీఎస్), సూపరింటెండింగ్ ఇంజినీర్ (బొగ్గు, కమర్షియల్), గని ఏజెంట్ జి. శ్రీనివాసరావు, జనరల్ మేనేజర్ (మైన్స్) పి. మోహన్ రావు పురస్కారాన్ని స్వీకరించారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!