

తమిళనాడు ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే విద్యార్థులకు వారానికి ఒకసారి చికెన్ బిర్యానీ అందించే ప్రతిపాదనను రాష్ట్ర ప్రభుత్వం పరిశీలిస్తోంది. పాఠశాల విద్యాశాఖ మంత్రి రాజ్‌మోహన్ తాజాగా ఈ అంశంపై మరోసారి స్పష్టత ఇచ్చారు. ముఖ్యమంత్రి సి. జోసెఫ్ విజయ్ ఆకాంక్షగా ఉన్న ఈ ప్రతిపాదనను వెంటనే అమలు చేయకుండా ముందుగా పైలట్ ప్రాజెక్ట్ చేపట్టాలని ప్రభుత్వం భావిస్తోంది. పెద్ద సంఖ్యలో విద్యార్థులకు ఆహారం తయారు చేసి సరఫరా చేయాల్సి ఉండటంతో పరిశుభ్రత, ఆహార భద్రత, వంట, నిల్వ, రవాణా వంటి అంశాలను ముందుగా పరీక్షించనున్నారు.
ఈ ప్రతిపాదనపై జూలై నుంచే ప్రభుత్వం పరిశీలన జరుపుతోంది. పెరుగుతున్న పిల్లలకు తగినంత ప్రొటీన్లు అవసరమనే ఉద్దేశంతో వారానికి ఒకసారి చికెన్ బిర్యానీని మధ్యాహ్న భోజన పథకంలో చేర్చాలని ఆలోచిస్తున్నారు. శాకాహారం తీసుకునే విద్యార్థులకు యథావిధిగా వెజిటేరియన్ భోజనం అందిస్తామని మంత్రి తెలిపారు. అలాగే తమిళనాడులో ఇప్పటికే ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల కోసం ఉదయం అల్పాహార పథకం అమలులో ఉంది. ఈ పథకాన్ని మరింత విస్తరించడంతో పాటు మెనూలో పోషక విలువలు పెంచే మార్పులపై కూడా ప్రభుత్వం కసరత్తు చేస్తోంది.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!