

తిరుమలలో శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో అత్యంత కీలకమైన గరుడ సేవ రేపు జరగనుంది. అదే సమయంలో తమిళ భక్తులు పవిత్రంగా భావించే పెరటాసి నెల తొలి శనివారం కూడా కావడంతో తిరుమల కొండకు భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో జిల్లా పోలీసు యంత్రాంగం, టీటీడీ భద్రతా అధికారులు ప్రత్యేక భద్రతా చర్యలపై దృష్టి సారించారు. నాలుగు మాడ వీధులు, ఔటర్ రింగ్ రోడ్, ప్రధాన కూడళ్ల వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేయడంతో పాటు భక్తుల రద్దీని క్రమబద్ధీకరించేందుకు ప్రత్యేక ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.
భారీ రద్దీ నేపథ్యంలో ఇవాళ సాయంత్రం నుంచి తిరుమలకు ద్విచక్ర వాహనాల రాకపోకలపై ఆంక్షలు విధించనున్నారు. వాహనాల పార్కింగ్ ప్రాంతాలు, గ్యాలరీల్లోకి భక్తుల ప్రవేశం, రీఫిల్లింగ్ ద్వారా గ్యాలరీల్లోకి భక్తులను అనుమతించే విధానంపై అధికారులు సమీక్షించారు. నాలుగు మాడ వీధుల్లో ఏర్పాటు చేసిన గ్యాలరీల్లో సుమారు 1.80 లక్షల మంది భక్తులకు అనుమతి కల్పించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. గ్యాలరీలతో పాటు ప్రధాన ప్రాంతాల్లో భారీ స్క్రీన్లు ఏర్పాటు చేయనున్నారు. ఔటర్ రింగ్ రోడ్డులో వాహనాల పార్కింగ్‌కు ప్రత్యేక చర్యలు చేపడుతున్నారు. తిరుమలకు వచ్చే ప్రతి భక్తుడు గరుడ సేవను వీక్షించేలా రద్దీ నిర్వహణ, భద్రతా ఏర్పాట్లను సమన్వయం చేయాలని అధికారులు చర్యలు చేపట్టారు.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!