

తమిళనాడు రాజకీయ వర్గాల్లో మంత్రి ఆధవ్ అర్జున వ్యక్తిగత జీవితానికి సంబంధించిన వార్త చర్చనీయాంశంగా మారింది. ఆయన భార్య డైసీ మార్టిన్ తమ వైవాహిక బంధానికి ముగింపు పలికి, పరస్పర అంగీకారంతో విడివిడిగా జీవించాలని నిర్ణయించుకున్నట్లు నవంబర్ 16న ఇన్స్టాగ్రామ్లో ప్రకటించారు. సుమారు 14 ఏళ్ల తమ ప్రయాణంలో స్నేహితులుగా, జీవిత భాగస్వాములుగా, తల్లిదండ్రులుగా ఎన్నో అనుభవాలను పంచుకున్నామని ఆమె పేర్కొన్నారు. ఈ నిర్ణయం తమ జీవితాల్లో కొత్త అధ్యాయానికి నాంది అని తెలిపారు.
విడిపోవాలనే నిర్ణయం వెనుక ఇతరుల ప్రమేయం లేదని, కుటుంబ పరిస్థితులు కూడా దీనికి కారణం కాదని డైసీ తన ప్రకటనలో స్పష్టం చేశారు. తమ పిల్లల సంతోషం, సంక్షేమమే ప్రాధాన్యమని, తల్లిదండ్రులుగా బాధ్యతలను కలిసి కొనసాగిస్తామని తెలిపారు. ఆధవ్ అర్జునపై తనకు ఎప్పటికీ గౌరవం ఉంటుందని, ఆయన భవిష్యత్తులో సంతోషం, ప్రశాంతత, విజయం సాధించాలని ఆకాంక్షించారు. ఈ సమయంలో తమ వ్యక్తిగత జీవితానికి, కుటుంబ గోప్యతకు గౌరవం ఇవ్వాలని అభిమానులు, మీడియాను కోరారు.



కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!