

శ్రీకాకుళం జిల్లాలో భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో పరిస్థితిని పరిశీలించేందుకు వెళ్లిన టీడీపీ ఎమ్మెల్యే కూన రవికుమార్‌కు ప్రమాదం తప్పింది. కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, ఎస్పీ కేవీ మహేశ్వర రెడ్డితో పాటు ఇతర అధికారులు వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలిస్తుండగా ఒక్కసారిగా వరద ప్రవాహం ఉధృతమైంది. ఈ క్రమంలో ఎమ్మెల్యేతో పాటు కలెక్టర్, ఎస్పీ, ఇతర అధికారులు వరద ప్రవాహంలో చిక్కుకున్నారు. శ్రీకాకుళం జిల్లాలో నాగావళి, వంశధార నదులకు వరద ఉధృతి పెరుగుతున్న నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉన్నారు.
సమాచారం అందుకున్న వెంటనే సహాయక బృందాలు రంగంలోకి దిగాయి. ఎన్డీఆర్‌ఎఫ్, ఎస్‌డీఆర్‌ఎఫ్ బృందాలు సహాయక చర్యలు చేపట్టి ఎమ్మెల్యే కూన రవికుమార్, కలెక్టర్, ఎస్పీతో పాటు ఇతర అధికారులను సురక్షితంగా బయటకు తీసుకువచ్చినట్లు సమాచారం. జిల్లాలో వరద ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఉధృతంగా ప్రవహిస్తున్న నదులు, వాగులు, వంకలు దాటేందుకు ప్రయత్నించవద్దని అధికారులు సూచిస్తున్నారు.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!