

బిగ్‌బాస్ తెలుగు 10 ఇంట్లో పదో వారం నామినేషన్ల సందర్భంగా ముకేష్ గౌడ, సుధీర్ మధ్య మాటల యుద్ధం తీవ్రంగా సాగినట్లు కనిపిస్తోంది. సీజన్ ప్రారంభం నుంచి ఒకే గ్రూపులో ఉన్న ఈ ఇద్దరి మధ్య ఇప్పుడు విభేదాలు బయటపడుతున్నాయి. గతంలో తన పవర్‌ను ఉపయోగించి సుధీర్‌ను సేఫ్ చేశానని, ఝాన్సీతో కూడా అతడి కోసం పవర్ వినియోగించేలా చేశానని ముకేష్ గుర్తుచేస్తున్నాడు. తన వల్లే సుధీర్ కెప్టెన్ అయ్యాడని, కనీసం కంటెండర్‌గా నిలిచే అవకాశం కూడా వచ్చిందని విమర్శిస్తున్నాడు. దీనికి సుధీర్ ఘాటుగా స్పందిస్తూ, ఆటలో ముకేష్ సాధించిందేమిటని ప్రశ్నిస్తున్నాడు.
మరోవైపు, దేబ్జానీ విషయంలో చేసిన ప్రాంక్‌తో పాటు తన క్యారెక్టర్‌పై చేసిన వ్యాఖ్యలను శివ్ ప్రశ్నించాడు. దీనిపై ముకేష్, శివ్ మధ్య కూడా వాగ్వాదం జరిగింది. సుధీర్ ముకేష్‌ను బ్యాక్‌స్టాబర్, నమ్మకద్రోహి అంటూ విమర్శించగా, ముకేష్ కూడా అతడి ఆటతీరుపై వ్యాఖ్యలు చేశాడు. చివరికి ముకేష్‌ను గుండు సున్నా అంటూ సుధీర్ సెటైర్ వేయగా, మబ్బుల్లో ఉంటున్నావంటూ శివ్ పేరు ఆధారంగా ముకేష్‌పై కౌంటర్ ఇచ్చాడు. ఇదిలా ఉండగా, సాక్ గేమ్‌లో జరిగిన ఘటనపై నీతూ, నరేష్ మధ్య కూడా వాదన జరిగింది. శ్వేత, త్రిగుణ్ తదితరులు ఈ చర్చలో స్పందించడంతో ఇంట్లో నామినేషన్ల వాతావరణం మరింత వేడెక్కింది.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!